Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఖరీదు కత్రినా కైఫ్ : అందాలు రెట్టింపు చేసుకోవడంలో అందెవేసిన చేయి

Webdunia
బుధవారం, 18 మార్చి 2020 (12:04 IST)
బాలీవుడ్ హీరోయిన్లలో కత్రినా కైఫ్ ఒకరు. ఈమె గతంలో ఒకటి రెండు తెలుగు చిత్రాల్లో కూడా నటించారు. విక్టరీ వెంకటేష్ నటించిన "మల్లీశ్వరి" చిత్రం ద్వారా తెలుగు వెండితెరకు పరిచయమైంది. ఆ తర్వాత ఆమెకు పెద్ద అవకాశాలు రాకపోవడంతో తెలుగు వెండితెరకు దూరమైంది. అదేసమయంలో ఆమె బాలీవుడ్‌లో బిజీ అయిపోయి, స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. 
 
ఈ నేపథ్యంలో కత్రినా కైఫ్ అందానికి అత్యంత ప్రాముఖ్యతనిస్తుంది. ముఖ్యంగా, దుస్తులతో తన అందచందాలను రెట్టింపు చేసుకోవడంలో ఆమె అందెవేసిన చేయని చెప్పొచ్చు. తనకు నచ్చిన కాస్ట్యూమ్‌ ఎంత ఖరీదైనా సరే ఆమె కొనుగోలు చేస్తుంది. ఈ విషయాన్ని ఆమె మరోమారు తాజాగా నిరూపించింది. 
 
ఇటీవల ఓ డ్రస్‌ కత్రినాకు తెగ నచ్చిందట. దాని ఖరీదు అక్షరాలా రూ.2.2 లక్షలు. అయినా అది నచ్చేయడంతో అంత డబ్బు పోసి మరీ కొనేసిందట. వెంటనే ఆ డ్రస్సు వేసుకుని ఫోటోలుకూడా దిగేసి సోషల్‌ మీడియాలో పోస్టు చేసింది. ఆ ఫోటోలు చూసి కత్రినా అందాన్నీ, ఆ డ్రస్సునీ నెటిజన్లు తెగ మెచ్చుకుంటున్నారట. 
 
ఈ ఇమేజ్‌ కోసమే కత్రినా ఎప్పుడూ తహతహలాడుతూ ఉంటుందనీ, దాని కోసం ఎంత ఖర్చయినా పెడుతుందని బాలీవుడ్‌ జనాలంటున్నారు. ఒక డ్రస్సుకే అంత ఖర్చు చేస్తే మిగతా కాస్ట్యూమ్స్‌కి ఎంత ఖర్చు చేస్తుందో అంటూ కొందరు ఆశ్చర్యపోతున్నారట. ఎంతయినా కత్రినా చాలా ఖరీదైన హీరోయిన్‌ అన్న మాట ఇప్పుడు ప్రతి నోటా వినపడుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

KTR: కేటీఆర్‌‌కు ఓ స్వీట్ న్యూస్ ఓ హాట్ న్యూస్.. ఏంటది?

గంటలో శ్రీవారి దర్శనం.. ఎలా? వారం రోజుల పాటు పైలెట్ ప్రాజెక్టు!

బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం... ఉత్తారంధ్రకు భారీ వర్ష సూచన!

మీసాలు తిప్పితే రోడ్లు పడవు : మీ కోసం పని చేయనివ్వండి .. పవన్ కళ్యాణ్

హనీమూన్‌కు ఎక్కడికి వెళ్లాలి.. అల్లుడుతో గొడవు.. మామ యాసిడ్ దాడి!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

పొడియాట్రిక్ పాదాలు-చీలమండ చికిత్సను మెరుగుపరచడానికి ఇసావోట్ అత్యాధునిక ఓ-స్కాన్ ఎంఆర్ఐ మెషీన్‌

చేదుగా వుండే కాకరకాయ ఆరోగ్యానికి అద్భుతమైన మేలు

ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోదగిన ఆహారం, ఏంటి?

భారతదేశంలో పెరుగుతున్న ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కేసులు: ముందస్తుగా గుర్తించడం ఎందుకు కీలకం

తర్వాతి కథనం
Show comments