అర్థరాత్రిలో స్నేహితుడి ఇంట్లో బాలీవుడ్ ప్రేమ జంట రాసలీలలు (video)

బుధవారం, 22 జనవరి 2020 (11:31 IST)
బాలీవుడ్ నటి కత్రినా కైఫ్. మరో బాలీవుడ్ సినీ హీరో విక్కీ కౌశల్. ఈ కుర్ర హీరో.. సీనియర్ హీరోయిన్ అయిన కత్రినా కైఫ్‌తో డేటింగ్‌లో మునిగితేలుతున్నాడు. ఎక్కడకు వెళ్లినా ఎవరో ఒకరి కంట పడుతుండటంతో ఈ ప్రేమజంట తన స్నేహితుల ఇంట్లో అర్థరాత్రి పూట కలుసుకుంటూ రాసలీలల్లో మునిగితేలుతున్నట్టు బాలీవుడ్ కోడై కూస్తోంది. 
 
నిజానికి కత్రినా కైఫ్ - విక్కీ కౌశల్‌లు గత కొంతకాలంగా డేటింగ్‌ చేస్తున్న విషయం తెల్సిందే. గతంలో దీపావళి పండుగ సందర్భంగా ఓ పార్టీలో మెరిశారు. గతంలో ఓ రెస్టారెంట్‌లోనూ చెట్టాపట్టాలేసుకొని వచ్చిన కత్రినా, విక్కీల ఫోటోలను ఓ చెఫ్ తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో అవి కాస్తా వైరల్ అయ్యాయి. 
 
రాత్రివేళ అత్యంత రహస్యంగా కత్రినా కైఫ్, విక్కీకౌశల్‌లు వేర్వేరు కార్లలో ముంబైలోని ఓ స్నేహితుడి ఇంటికి వచ్చి కలిశారని సమాచారం. కత్రినా, విక్కీలు మంగళవారం రాత్రి వేర్వేరుగా కార్లలో వచ్చిన ఫోటోలను ఓ ఫోటో గ్రాఫర్ క్లిక్ మనిపించారు. ఆ ఫోటోలు కాస్తా మీడియాలో రావడంతో వీరి డేటింగ్ గుట్టు మరోసారి బయటపడింది. కాగా కత్రినా కైఫ్, విక్కీకౌశల్‌లు మాత్రం తమ ప్రేమ గురించి అధికారికంగా వెల్లడించలేదు. 
 

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం నటి అమలా పాల్ తండ్రి హఠాన్మరణం... దుఃఖసాగరంలో హీరోయిన్ ఫ్యామిలీ