గ్రామీణ నేపథ్యంలో నడిచే ప్రేమకథతో కార్తికేయ 'బెదురులంక'

Webdunia
శుక్రవారం, 10 ఫిబ్రవరి 2023 (18:13 IST)
హీరో కార్తికేయ, నేహా శెట్టి జంటగా నటించిన కొత్త చిత్రం "బెదురులంక 2012". గ్రామీణ నేపథ్యంలో సాగే ప్రేమకథతో తెరకెక్కించారు. మణిశర్మ సంగీత స్వరాలు సమకూర్చగా, రవీంద్ర బెనర్జీ నిర్మించారు. ఈ చిత్రానికి క్లాక్స్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం టీజర్‌ను తాజాగా రిలీజ్ చేశారు. 
 
లంక గ్రామాల్లో ఒకటైన బెదురులంక అనే గ్రామంలో 2012లో నడిచే కథ. ఆ సమయంలో యుగాంతం జరుగనున్నట్టుగా జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ ప్రచారంతో ముడిపడిన సంఘటనలతో ఈ సినిమా సాగుతుందనే విషయం ఈ టీజర్‌ను బట్టి అర్థమవుతుంది. 
 
హీరో హీరోయిన్ ప్రేమ వ్యవహారం, డ్రామా కంపెనీకి సంబంధించిన సందడిని కలుపుకుంటూ ఈ కథ సాగుతుంది. లవ్, యాక్షన్, కామెడీపై ఈ టీజర్‌ను కట్ చేశారు. అజయ్ ఘోష్, శ్రీకాంత్ అయ్యంగార్, రామ్ ప్రసాద్‌లు ముఖ్యమైన పాత్రలను పోషించిన ఈ సినిమాకి మణిశర్మ సంగీతాన్ని అందించారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రాష్ట్రంలో ప్రతిరోజూ 7,200 టన్నుల చెత్త: చెత్త శుద్ధి ప్లాంట్లను పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్

హ్యాక్ టు ది ఫ్యూచర్‌లో ఏఐ ఆధారిత పరిష్కారాలను రూపొందించిన తెలుగు రాష్ట్రాల ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు

మోటార్లకు మీటర్లు అమర్చినా.. ఉచిత విద్యుత్ నిలిపివేసినట్టు నిరూపిస్తే ఎన్నికల్లో పోటీ చేయం : సీఎం రేవంత్ సవాల్

మమతా బెనర్జీ మేనల్లుడుపై భౌతికదాడి.. రాళ్లు - కోడిగుడ్లు - చెప్పులతో...

బీఆర్ఎస్ నేత బాల్క సుమన్‌పై నాన్ బెయిలబుల్ కేసు : అరెస్టు చేసిన పోలీసులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రై బ్లాక్ కిస్‌మిస్ ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తిరుపతిలో క్యాన్సర్ విజృంభణను అడ్డుకోవడం: సంరక్షణ చర్యలను విస్తరిస్తోన్న ఎస్‌విఐసిసిఎఆర్

Shatavari Tea, స్త్రీలకు అద్భుతమైన ఆరోగ్యాన్నిచ్చే శతావరి టీ, ఎలా తయారు చేయాలి?

తిప్పతీగ ఆయుర్వేద ప్రయోజనాలు

కిడ్నీ సమస్య వుందని తెలిపే సంకేతాలు

తర్వాతి కథనం
Show comments