Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కార్తికేయ, నేహా శెట్టి చిత్రానికి బెదురులంక 2012 ఖ‌రారు

Karthikeya and Neha Shetty
, బుధవారం, 21 సెప్టెంబరు 2022 (12:41 IST)
Karthikeya and Neha Shetty
హీరో కార్తికేయ, 'డీజే టిల్లు' ఫేమ్ నేహా శెట్టి జంటగా సినిమా రూపొందుతోంది. ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ పురస్కారం అందుకున్న 'కలర్ ఫొటో' తీసిన నిర్మాత రవీంద్ర బెనర్జీ (బెన్నీ) ముప్పానేని నిర్మిస్తున్న తాజా చిత్రమిది. లౌక్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై ప్రొడక్షన్ నంబర్ 3గా బెన్నీ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సి. యువరాజ్ చిత్ర సమర్పకులు. క్లాక్స్ దర్శకత్వం వహిస్తున్నారు. 
 
ఈ చిత్రానికి 'బెదురులంక 2012' టైటిల్ ఖరారు చేశారు. నేడు (సెప్టెంబర్ 21) కార్తికేయ గుమ్మకొండ పుట్టినరోజు. ఈ సందర్భంగా టైటిల్ వెల్లడించారు.
 
ఈ సందర్భంగా చిత్రనిర్మాత బెన్నీ ముప్పానేని మాట్లాడుతూ "మా హీరో కార్తికేయకు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన బ‌ర్త్‌డేకు టైటిల్ వెల్లడించడం సంతోషంగా ఉంది. త్వరలో ఫస్ట్ లుక్ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. కామెడీ డ్రామాగా, గోదావరి నేపథ్యంలో సాగే కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. ఇటీవల మూడో షెడ్యూల్ ముగిసింది. యానాం, కాకినాడ, గోదావరి పరిసర ప్రాంతాల్లో అందమైన లొకేషన్లలో  చిత్రీకరణ చేశాం. ఆఖరి షెడ్యూల్ త్వరలో ఉంటుంది. దాంతో సినిమా మొత్తం పూర్తవుతుంది. మెలోడీ బ్రహ్మ మణిశర్మ ఐదు అద్భుతమైన బాణీలను అందించారు. 'స్వర్గీయ' సిరివెన్నెల గారు మా చిత్రంలో ఒక పాట రాశారు" అన్నారు.
 
దర్శకుడు క్లాక్స్ మాట్లాడుతూ "డ్రామెడీ (డ్రామా ప్లస్ కామెడీ) జానర్ చిత్రమిది. ఈ సినిమాలో కొత్త కార్తికేయ కనిపిస్తారు. ఒక ఊరు నేపథ్యంలో వినోదం, మానవ భావోద్వేగాలతో కూడిన కథతో సినిమా రూపొందిస్తున్నాం. ఇందులో స్ట్రాంగ్ కంటెంట్ ఉంది. అలాగే, కడుపుబ్బా నవ్వించే వినోదం ఉంది. మనసుకు నచ్చినట్టు జీవించే పాత్రలో హీరో కార్తికేయ కనిపిస్తారు. సొసైటీకి నచ్చినట్లు బతకడం రైటా? మనసుకు నచ్చినట్టు బతకడం రైటా? అనేది సినిమాలో చూడాలి" అని చెప్పారు.  
 
కార్తికేయ, నేహా శెట్టి జంటగా నటిస్తున్న ఈ సినిమాలో అజయ్ ఘోష్, రాజ్ కుమార్ కసిరెడ్డి, శ్రీకాంత్ అయ్యంగార్, 'ఆటో' రామ్ ప్రసాద్, గోపరాజు రమణ, ఎల్బీ శ్రీరామ్, సత్య, సురభి ప్రభావతి, కిట్టయ్య, అనితానాథ్, దివ్య నార్ని ప్రధాన తారాగణం. 
 
ఈ చిత్రానికి యాక్షన్: అంజి, పృధ్వీ కాస్ట్యూమ్ డిజైనర్: అనూషా పుంజాల, పి.ఆర్.ఓ: పులగం చిన్నారాయణ, ఎడిటింగ్: విప్లవ్ న్యాసదం, సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి, కిట్టూ విస్సాప్రగడ, కృష్ణ చైతన్య, ప్రొడక్షన్ డిజైన్: సుధీర్ మాచర్ల, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: దుర్గారావు గుండా, సినిమాటోగ్రఫీ: సాయి ప్రకాష్ ఉమ్మడిసింగు, సన్నీ కూరపాటి, కొరియోగ్రాఫర్: బృంద, మోయిన్, సంగీతం: మణిశర్మ, సహ నిర్మాతలు: అవనీంద్ర ఉపద్రష్ట, వికాస్ గున్నల, సమర్పణ: సి. యువరాజ్, నిర్మాత: రవీంద్ర బెనర్జీ ముప్పానేని, రచన - దర్శకత్వం: క్లాక్స్.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రముఖ కమెడియన్ రాజు శ్రీవాత్సవ మృతి