Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నేహా శెట్టితో రూల్స్ రంజన్ రొమాన్స్

Advertiesment
Neha Shetty
Neha Shetty
'యస్.ఆర్.కళ్యాణ్ మండపం' సినిమాతో హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న కిరణ్ అబ్బవరం ప్రస్తుతం నటిస్తున్న చిత్రం 'రూల్స్ రంజన్'. రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమాకి రతినం కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఎ.యం.రత్నం సమర్పణలో దివ్యాంగ్ లవానియా, వి.మురళీకృష్ణ సంయుక్తంగా స్టార్ లైట్ ఎంటర్ టైన్ మెంట్స్ ప్రై లిమిటెడ్ పతాకంపై ఈ చిత్రం రూపొందుతోంది. టాలీవుడ్, బాలీవుడ్ కి చెందిన పలువురు ప్రముఖ నటీనటులు పాల్గొనగా ఈ చిత్రం ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
 
తాజాగా ఈ సినిమాకి హీరోయిన్ కూడా కన్ ఫార్మ్ అయ్యింది. 'డి.జె.టిల్లు' ఫేమ్ నేహా శెట్టి కథానాయికగా నటించనుంది. 'యస్.ఆర్.కళ్యాణ్ మండపం' తో కిరణ్ అబ్బవరం, 'డి.జె.టిల్లు' తో నేహా శెట్టి సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ ఇద్దరూ కలిసి 'రూల్స్ రంజన్' చిత్రంలో నటించనుండటంతో సినిమాకి పాజిటివ్ వైబ్రేషన్స్ నెలకొన్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శ్రీవిష్ణు న‌టిస్తున్న అల్లూరి ఫస్ట్ లుక్ ఇదే