నటి ఆదాశర్మ ఈమధ్య సినిమారంగానికి దూరంగా వుంది. తెలుగులో నితిన్‌తో `హార్ట్ ఎటాక్`, అల్లు అర్జున్‌తో `సన్నాఫ్ సత్యమూర్తి` సినిమాలో మెరిసింది. ఆ తర్వాత గరం, క్షణం సినిమాల్లో నటించింది. కన్నడ, తమిళంలో నటించినా హిందీలో 2017లో కమాండో2లో నటించింది. ఆ తర్వాత పలు వ్యాపార ప్రకటనలు చేసింది. కేరళలో పుట్టి పెరిగిన ఆమె ఆ తర్వాత తన తండ్రి ఉద్యోగ్యం రీత్యా ముంబైలో పెరిగింది.
Adah sarma-1
అప్పుడప్పుడు సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా వుండే తను ఈరోజు సముద్రతీరంలో కర్రసాము చేస్తూన్న వీడియోను పోస్ట్ చేసింది. కేరళకుచెందిన సిలాంబం ప్రాక్టీస్ చేస్తోంది. ఆమె కర్రసాము చేశాక సముద్ర తీరంలో ఒకసారిగా కొన్ని కుక్కలు ఆమె వద్దకు వచ్చాయి. వాటిని తను ఆప్యాయంగా నిమిరింది. ఇక ఈ కర్రసాము కేరళలో ఓ విద్య.
ఇంకోవైపు తాడుపైనుంచి దిగడం. తాడుసాయంతో ఎక్కడం వంటి విన్యాసాలను చేస్తూ చాలా కష్టపడుతుంది. అయితే తమిళంలో రూపొందో ఓ పాన్ ఇండియా మూవీలో రాజకుమార్తెగా నటించనున్నదని తెలుస్తోంది. అందుకు సంబంధించిన విన్యాసాలను ఆమె చేస్తుందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఇందులో ఆమె నవ్వుతూనే సమాధానం చెబుతోంది. త్వరలో ఆమె పాన్ ఇండియా మూవీలో కనిపించనుందన్నమాట.