Webdunia - Bharat's app for daily news and videos

Install App

`ద‌మ్మున్నోడు` ప్రారంభం

Webdunia
మంగళవారం, 6 జులై 2021 (16:41 IST)
Dammunnodu clap
బి.కె.ప్రొడ‌క్ష‌న్ ప‌తాకంపై శివ‌ జొన్న‌ల‌గ‌డ్డ హీరోగా న‌టిస్తూ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న చిత్రం `ద‌మ్మున్నోడు`. దుమ్ముదులుపుతాడు ట్యాగ్ లైన్‌. బాలాజీ కొండేక‌ర్, రేణుక కొండేక‌ర్ నిర్మాత‌లు. ప్రియాంశ్‌, గీతాంజ‌లి, స్వ‌ప్న‌ హీరోయిన్స్. మంగ‌ళ‌వారం హైద‌రాబాద్‌లోని రాక్ క్యాసిల్ హోట‌ల్ లో ప్రారంభ‌మైంది. సీనియ‌ర్  ప్రొడ్యూస‌ర్ ప్ర‌స‌న్న కుమార్ తొలి స‌న్నివేశానికి క్లాప్ నివ్వ‌గా మ‌రో ప్ర‌ముఖ‌ నిర్మాత తుమ్మ‌ల‌ప‌ల్లి రామ‌స‌త్య‌నారాయ‌ణ కెమెరా స్విచాన్ చేశారు.
అనంత‌రం తుమ్మ‌ల‌ప‌ల్లి మాట్లాడుతూ, జొన్న‌ల‌గ‌డ్డ శివ ప్ర‌తి సినిమాకు ఓ ప్ర‌త్యేకత ఉంటుంది. అభిరుచి గ‌ల ద‌ర్శ‌కుడు. చిన్న బ‌డ్జెట్ లో పాట‌లు, ఫైట్స్ గ్రాండ్ గా చేస్తూ మంచి పేరు తెచ్చుకున్నాడని` అన్నారు.
ప్ర‌స‌న్న కుమార్ మాట్లాడుతూ,  టైటిల్ చాలా బావుంది. కోవిడ్ స‌మ‌యంలో కూడా సినిమా చేస్తూ ఎంతో మందికి ప‌ని క‌ల్పిస్తోన్న శివ‌ను అభినందిస్తూ ఈ సినిమా విజ‌యవంతం కావాల‌ని కోరుకుంటున్నా`` అన్నారు.
 
హీరో-డైర‌క్ట‌ర్ శివ జొన్న‌ల‌గ‌డ్డ మాట్లాడుతూ,. నా క‌థ‌, టైటిల్ న‌చ్చి మా నిర్మాత బాలాజీ నిర్మించ‌డానికి ముందుకొచ్చారు.  ప‌వ‌ర్ ఫుల్ స్టోరి, మాస్ ఎలిమెంట్స్, భారీ ఫైట్స్, సాంగ్స్ తో రూపొందుతోన్న సినిమా ఇది. ఈ రోజు ఫైట్ తో షూటింగ్ ప్రారంభించాం. ఇప్ప‌టి వ‌ర‌కు నాకు ఫైట్స్ ప‌రంగా మంచి పేరొచ్చింది. ఈ సినిమాతో డాన్స్ ప‌రంగా కూడా పేరొస్తుందన్న న‌మ్మ‌కముంది. ఇందులో నాలుగు పాట‌లు కుదిరాయి. మూడు షెడ్యూల్స్ లో సినిమాను పూర్తి చేస్తాం``అన్నారు.
 
నిర్మాత బాలాజీ కొండేక‌ర్ మాట్లాడుతూ, గ‌తంలో `సూప‌ర్ ప‌వ‌ర్‌` చిత్రానికి స‌హ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించా.  ద‌మ్మున్నోడు క‌థ‌, టైటిల్ న‌చ్చి సోలోగా నిర్మిస్తున్నా. ఇందులో ఏడు భారీ ఫైట్స్, నాలుగు అద్భుత‌మైన పాట‌లు ఉంటాయి. ఎక్క‌డా రాజీ ప‌డ‌కుండా సినిమా నిర్మించ‌డానికి ప్లాన్ చేశాం`` అన్నారు.
ఇంకా ఈ కార్య‌క్ర‌మంలో సంగీత ద‌ర్శ‌కుడు ఎల్.ఎమ్ ప్రేమ్ , కొరియోగ్రాఫ‌ర్ బ్ర‌ద‌ర్ ఆనంద్‌, హీరోయిన్ ప్రియాంశ్ పాల్గొని అవ‌కాశం ప‌ట్ల ఆనందాన్ని వ్య‌క్తం చేశారు.

సంబంధిత వార్తలు

దుస్తులు విప్పేసి బెంగుళూరు రేవ్ పార్టీ ఎంజాయ్... నేను లేనంటున్న నటి హేమ!!

రోదసీలోకి వెళ్లిన తొలి తెలుగు టూరిస్ట్ - ఎవరీ గోపీచంద్ తోటకూర

అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు సిక్సర్ కొడుతున్నారు : ప్రశాంత్ కిషోర్

కెనడాలో దారుణ పరిస్థితులు .. అంత్యక్రియలకు డబ్బులు లేక పెరిగిపోతున్న అనాథ శవాల సంఖ్య!!

గర్భిణి మహిళకు వెజ్‌ స్థానంలో నాన్ వెజ్‌ డెలివరీ - జొమాటోపై భర్త ఆగ్రహం

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments