Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీచ్‌లో బికినీ కాక మరేం కట్టుకుంటారో? కరీనా ఘాటైన జవాబు

Webdunia
బుధవారం, 13 మార్చి 2019 (15:07 IST)
సోషల్ మీడియా నెటిజన్ల కారణంగా సెలబ్రిటీలకు చిక్కులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. ఇటీవలికాలంలో అనేక మంది ట్రోలింగ్‌కు గురవుతున్నారు. కొన్ని సందర్భాలలో అయితే నెటిజన్లు వాడుతున్న అభ్యంతరకరమైన భాషకు సెలబ్రిటీ తీవ్ర మనస్తాపానికి గురై కొందరు సైలెంట్‌గా ఉంటే, మరికొందరు ఘాటుగా రిప్లై ఇస్తున్నారు. 
 
ఇటీవల బాలీవుడ్ కపుల్ సైఫ్, కరీనాలకు నెటిజన్ నుంచి చేదు అనుభవం ఎదురైంది. ఆ నెటిజన్‌కు ఘాటుగా సమాధానమిచ్చింది కరీనా. అర్బాజ్ ఖాన్ చాట్ షోలో తనను ఉద్దేశించి తన భర్తకు ఓ నెటిజన్ చేసిన ట్రోల్‌ను చదివారు కరీనా. సైఫ్ అలీ ఖాన్, నీకు చచ్చి నరకానికి పోవాలని లేదా? నీ భార్య ఛండాలంగా బికినీ ధరించడం నీకు సిగ్గుగా అనిపించడం లేదా? అంటూ చేసిన ట్రోల్‌ చేశాడు.
 
దీనికి కరీనా సమాధానమిస్తూ... బికినీ ధరించడం అనేది నా స్వవిషయం, కుదరదని చెప్పడానికి సైఫ్ ఎవరు? అయినా మా రిలేషన్ అటువంటిది కాదు, మా బంధం బాధ్యతాయుతమైనది, మాకు ఒకరిపై మరొకరికి పూర్తి నమ్మకం ఉందని చెప్పింది. అయినా బీచ్‌లో బికినీ వేసుకోకపోతే ఇంకేం వేసుకుంటారు.. నీటిలో మునిగేటప్పుడు చీర కట్టుకోమంటావా? ఒకరి వ్యక్తిగత విషయాలలో తలదూర్చే హక్కు నీకేవరిచ్చారంటూ మండిపడ్డారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బెంగుళూరు తొక్కిసలాట : మృతదేహంపై బంగారు ఆభరణాలు చోరీ

కొండాపూర్‌లో రేవ్ పార్టీ... 50 ఓజీ కుష్ గంజాయి వినియోగం...

ఢిల్లీలో పాఠశాల బాత్రూమ్‌లో బాలుడిపై లైంగిక దాడి

మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంకు ఘన నివాళులు

నా కుమార్తె చనిపోయింది... వరకట్న నగలు తిరిగి ఇచ్చేయండి..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments