Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బిడ్డ పుట్టాక ఏ తల్లయినా కరీనాలా వుంటుందా..? ఎవరు?

బిడ్డ పుట్టాక ఏ తల్లయినా కరీనాలా వుంటుందా..? ఎవరు?
, మంగళవారం, 12 మార్చి 2019 (17:09 IST)
శరీరాకృతిపై కామెంట్లు చేస్తున్న నెటిజన్లకు తనదైన శైలిలో ధీటుగా సమాధానమిచ్చింది బాలీవుడ్ నటి సమీరారెడ్డి. అందరూ కరీనా కపూర్‌లా నాజూకుగా ఉండలేరు కదా అంటూ నెటిజన్లు తనపై చేస్తున్న కామెంట్లను సమీరారెడ్డి తిప్పికొట్టింది. ఇటీవల సమీరా తన కొడుకుతో కలిసి దిగిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఈ ఫోటోను చూసిన నెటిజన్లు ఆమె శరీరాకృతిపై ఘాటుగా కామెంట్‌లు చేసారు. ఆమె వీటికి ధీటుగా సమాధానమిచ్చారు.
 
పెళ్లై, పిల్లలను కన్న తర్వాత కూడా కొందరు కరీనాకపూర్‌లా అందంగా కనిపిస్తుంటారు..మరికొంతమంది తనలా సన్నబడటానికి కొద్దిగా సమయం తీసుకుంటారు. అంతేకానీ అందరూ కరీనాకపూర్‌లా ఉండాలని లేదు కదా..? అని ప్రశ్నించింది. ఆడవాళ్ల శరీరాకృతిని గురించి కామెంట్‌లు చేయడం సిగ్గుచేటు అని, మీరు పుట్టాక మీ అమ్మ అందంగా ఉందా? అని నెటిజన్ల నోరు మూయించింది. ఇలాంటి కామెంట్లు చేస్తున్నవారంతా సిగ్గుపడాలని సూచించింది సమీరా. 
 
ప్రతి ఆడపిల్ల తన జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు తల్లికాక తప్పదు. అంతేకాదు అమ్మ అని పిలిపించుకోవడం ఒక మధురమైన అనుభూతి. తనకు మొదటి కొడుకు పుట్టిన తర్వాత తాను బరువు తగ్గేందుకు సమయం పట్టిందని, తాను మళ్లీ తల్లి కాబోతున్నానని, మరోసారి లావయితే బరువు తగ్గేందుకు కూడా సమయం పట్టొచ్చని చెప్పింది. తెలుగులో చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలతో నటించిన సమీరారెడ్డి 2014 జనవరిలో ముంబైకి చెందిన వ్యాపారవేత్త అక్షయ్‌ను పెళ్లి చేసుకుంది. 2015 మే 24న మొదటి బిడ్డకు జన్మనిచ్చింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'లక్ష్మీస్ ఎన్టీఆర్' ప్రొమో వీడియోలో మోడీని కూడా వదల్లేదు...