Webdunia - Bharat's app for daily news and videos

Install App

దక్షిణాదికి దాసోహం అవుతున్న బాలీవుడ్

Webdunia
బుధవారం, 13 మార్చి 2019 (14:46 IST)
ఒకప్పుడు దక్షిణాది సినిమా ఇండస్ట్రీని బాలీవుడ్ చిన్నచూపు చూసేది. కానీ పరిస్థితి ఇప్పుడు బాగా మారిపోయింది. దక్షిణాదిలో ఏ సినిమా రిలీజై విజయం సాధించినా రీమేక్ హక్కుల కోసం బాలీవుడ్ జనాలు ఇక్కడకు వచ్చి వాలిపోతున్నారు. ఇక్కడి కథలు కూడా హిందీలో ఘన విజయం సాధిస్తుండటంతో బాలీవుడ్ దర్శక నిర్మాతల్లో మార్పు వచ్చింది. 
 
అయితే హిందీలోకి రీమేక్ చేయబడిన తొలి దక్షిణాది సినిమాగా 'రాముడు భీముడు' రికార్డుకెక్కింది. అప్పటి నుండి బాలీవుడ్‌లో తెలుగు సినిమాల హవా ప్రారంభమైంది. సూర్య నటించిన గజినీ సినిమా బాలీవుడ్‌లో 100 కోట్లు వసూలు చేసింది. దీంతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. దక్షిణాది సినిమా హక్కులకు భారీ స్థాయిలో డిమాండ్ ఏర్పడింది. తెలుగు అగ్ర హీరోలు నటించిన అనేక చిత్రాలు బాలీవుడ్‌లో కూడా ఘన విజయం సాధించాయి.
 
మహేష్ బాబు 'పోకిరీ'ని హిందీలో సల్మాన్ ఖాన్ రీమేక్ చేయగా, విక్రమార్కుడు సినిమాను అక్షయ్ కుమార్, టెంపర్ సినిమాను రణ్‌వీర్ సింగ్ రీమేక్ చేసి హిట్టు కొట్టారు. తాజాగా టాలీవుడ్ సంచలన విజయాలు ఆర్ఎక్స్ 100, అర్జున్ రెడ్డి సినిమాలు, కన్నడలో విజయం సాధించి తెలుగులో రీమేక్ అయిన కిరాక్ పార్టీ సినిమా కూడా బాలీవుడ్‌లో రీమేక్ అవుతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏడుకొండలను 5 కొండలుగా మార్చేందుకు కుట్ర : హోం మంత్రి అనిత

కరోనా రోగిపై అత్యాచారం... అంబులెన్స్ డ్రైవర్‌కు జీవితఖైదు

పరీక్షల్లో వైద్య విద్యార్థుల మాల్ ప్రాక్టీస్ - పట్టుబడిన మరో ఇద్దరు

ఎలుగుబంటికి నరకం చూపించిన గ్రామస్థులు!!

మామను గొడ్డలితో నరికి ... తలతో పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన అల్లుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments