Kantara 2: కాంతారా 2కి అన్నీ కలిసొస్తున్నాయ్.. వార్ 2తో పోటీ

సెల్వి
సోమవారం, 17 మార్చి 2025 (15:19 IST)
రిషబ్ శెట్టి కాంతార మొదటి భాగం కేవలం చిన్న సినిమాగా విడుదలై, అద్భుతమైన మౌత్ టాక్‌తో అంచనాలకు మించి వసూళ్లు రాబట్టింది. ఓపెనింగ్ డే కేవలం రూ.2.5 కోట్లు వసూలు చేసిన ఈ చిత్రం, హిందీ మార్కెట్‌లోనే రూ.100 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించడం విశేషం. 
 
ఈ సినిమా ఇప్పుడు కాంతార చాప్టర్ 1 పేరుతో ప్రీక్వెల్ రూపంలో వస్తోంది. ఈ సినిమాకు ఉన్న హైప్‌ను బట్టి చూస్తే, ఈసారి కనీసం రూ.800-1000 కోట్ల గ్లోబల్ గ్రాస్ టార్గెట్‌గా పెట్టుకోవచ్చు. కాంతార 2కు కూడా భారీ బూస్ట్ లభించింది. 
 
బాలీవుడ్ స్టార్ వరుణ్ ధావన్ సినిమా విడుదల షెడ్యూల్ మార్చుకోవడంతో, కాంతార 2 హిందీలో గాంధీ జయంతి రోజున సింగిల్ రిలీజ్ అవుతోంది. ఈ మార్పుతో దసరా కానుకగా ఈ చిత్రం భారీ వసూళ్లకు దారి తీసేలా కనిపిస్తోంది. ప్రస్తుతం బాక్సాఫీస్ పోటీ గురించి మాట్లాడుకుంటే, కాంతార 2 ప్రధానంగా వార్ 2 చిత్రంతో ఢీకొనబోతోంది. 
 
అయితే, ఈ చిత్రం విడుదలకు మరో కొంత సమయం ఉండటంతో, కాంతార 2 ఇప్పటికే తన స్థానం పక్కాగా సెట్ చేసుకున్నట్లు కనిపిస్తోంది. బాలీవుడ్ నుండి పోటీ లేకపోవడం, సౌత్‌లో హైప్ ఎక్కువగా ఉండడం వల్ల ఈ సినిమా 2025లో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ అవ్వాలని చూస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గచ్చిబౌలిలో డ్రగ్స్ పార్టీ గుట్టు రట్టు చేసిన పోలీసులు - 12మంది అరెస్ట్

ఆదిలాబాద్‌లో విమానాశ్రయ అభివృద్ధి: 700 ఎకరాల భూమికి ఆమోదం

Jagan Visits Cyclone areas: కృష్ణా జిల్లాలోని మొంథా తుఫాను ప్రాంతాల్లో జగన్ పర్యటన

AI vs Indian Intelligence, అపార్టుమెంట్ గృహ ప్రవేశానికి గోవుకి బదులు గోవు మరబొమ్మ (video)

వరల్డ్ కప్ గెలుచుకున్న ఆ క్షణాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయాం.. నారా బ్రాహ్మణి (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

తర్వాతి కథనం
Show comments