Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేవలం 20 టిక్కెట్లు మాత్రమే సేల్.. ధాకడ్‌తో ఖంగుతిన్న కంగనా రనౌత్

Webdunia
మంగళవారం, 31 మే 2022 (11:33 IST)
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ తాజా చిత్రం ధాకడ్‌‌తో కలెక్షన్ల పరంగా బాగా వెనక్కి తగ్గింది. ఈ సినిమా హిట్ కోసం ఎంతో కష్టపడిన కంగనా రనౌత్‌కు ఆశించిన ఫలితాలు రాలేదు.   
 
రజ్‌నీష్‌ ఘాయ్‌ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్‌ మూవీ మే 20న గ్రాండ్‌గా విడుదలైంది. రిలీజైన మొదటి రోజు నుంచే ఈ సినిమా కలెక్షన్లు దారుణంగా పడిపోయాయి. ఎనిమిదో రోజైన రెండో శుక్రవారం (మే 27) దేశవ్యాప్తంగా కేవలం 20 టికెట్లు మాత్రమే అమ్ముడు పోయాయి. దీంతో రూ. 4,420 మాత్రమే వసూళ్లను రాబట్టగలిగింది. 
 
ఈ మూవీకి మొత్తం బడ్జెట్‌ రూ. 90 కోట్లు. ఇప్పటివరకు ధాకడ్‌ నమోదు చేసిన షేర్‌ రూ. 5 కోట్లలోపే అని చిత్ర వర్గాలు అంటున్నాయి. 
 
ఈ లెక్కన చూసుకుంటే కంగనా మూవీకి వచ్చిన నష్టం రూ. 85 కోట్లకు పైమాటే. దీంతో ఈ సినిమా అత్యంత భారీ నష్టాలు మిగిల్చిన బిగ్గెస్ట్‌ డిజాస్టర్ చిత్రాల జాబితాలో చేరింది. అంతేకాకుండా ఈ సినిమా ఓటీటీలోకి వచ్చిన ఆ నష్టాన్ని భర్తీ చేలేదని బీటౌన్‌ టాక్.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వృద్ధుడికి ఆశ చూపిన మహిళ.. రూ. 8.7 కోట్లు కొట్టేశారు.. చివరికి ఏం జరిగిందంటే?

Bengal: పట్టపగలే హత్య.. తృణమూల్ కాంగ్రెస్ నాయకుడి కుమారుడిని కాల్చి చంపేశారు

తిరుమలలో ఆసక్తికర దృశ్యం.. అనుకోకుండా ఎదురుపడిన రోజా, నారాయణ (వీడియో)

వేడి వేడి మిర్చి బజ్జీ ప్రాణం తీసేసింది

Jagan: జగన్ రాఖీ శుభాకాంక్షలు.. ట్రోల్స్ మొదలు- దోచుకున్న దాన్ని దాచడానికి పోరాటం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

కూర్చుని చేసే పని, పెరుగుతున్న ఊబకాయులు, వచ్చే వ్యాధులేమిటో తెలుసా?

Heart attack: వర్షాకాలంలో గుండెపోటు ప్రమాదం ఎక్కువా?

కాలిఫోర్నియా బాదంతో ఆరోగ్యకరమైన రీతిలో రక్షా బంధన్‌ను వేడుక చేసుకోండి

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments