టీవీ నటి మైథిలి ఆత్మహత్యాయత్నం.. ఎందుకో తెలుసా...?

Webdunia
మంగళవారం, 31 మే 2022 (09:04 IST)
ఫోటో కర్టెసీ- ఇన్‌స్టాగ్రాం
టీవీ నటి మైథిలి ఆత్మహత్యాయత్నం హైదరాబాద్ నగరంలో సంచలనంగా మారింది. ఎస్ఆర్ నగర్ పరిధిలోని ఉన్న తన ఇంట్లో మైథిలి విషం తాగి ఆత్మహత్యకు యత్నించారు. సమాచారం అందుకున్న పోలీసులు నటి నివాసానికి చేరుకొని ఆమెను నిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం నటి మైథిలి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. 
 
తన భర్తతో 2021లో నెలకొన్న విభేదాల కేసులో ఇప్పటి వరకు తనకు న్యాయం జరగలేదని మనస్తాపానికి లోనై ఆమె పోలీసులకు కాల్ చేసి సూసైడ్ చేసుకునేందుకు యత్నించింది.
 
పంజాగుట్ట పీఎస్ ఎస్‌ఐ... ఎస్‌ఆర్‌నగర్‌ పోలీసుల సహాయంతో ఆమె ఉన్న ప్రదేశానికి చేరుకుని కాపాడారు. అనంతరం ఆమెను నిమ్స్ దవాఖానాకు తరలించారు పంజాగుట్ట పోలీసులు. ఎస్ఆర్ నగర్ పరిధిలో ఆత్మహత్యాయత్నం జరగడంతో ఎస్ఆర్ నగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
 
గతంలో సూర్యాపేట జిల్లా మోతె పీఎస్‌లో మైథిలి తన భర్త, అతని కుటుంబ సభ్యులపై ఫిర్యాదు చేశారు. తర్వాత సెప్టెంబర్ 2021లో నటి మైథిలి తన భర్తపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఆమె భర్త శ్రీధర్, మరో నలుగురు నిందితులుగా ఉన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జూబ్లీహిల్స్‌లో కేంద్ర బలగాలను మోహరించాలి.. ఆ విషయంలో ఈసీ మౌనం ఎందుకు? బీఆర్ఎస్

చీమలంటే భయం చచ్చిపోతున్నా.. పాప జాగ్రత్త.. అన్నవరం, తిరుపతికి 1116, ఎల్లమ్మకు ఒడిబియ్యం

బార్బర్ షాపులో వ్యక్తికి మెడ తిప్పుతూ మసాజ్, పక్షవాతం వచ్చేస్తుందా? (video)

Vande Mataram: వందేమాతరం 150వ వార్షికోత్సవం.. అమిత్ షా, పవన్ కల్యాణ్ ఏమన్నారంటే?

నల్లటి నాగుపాము కాలుకు చుట్టుకుని కాటేసింది.. ఆ వ్యక్తి దాన్ని కొరికేశాడు.. తర్వాత?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిక్కుడు కాయలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఎంత?

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

తర్వాతి కథనం
Show comments