Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చేతిలో చిల్లిగవ్వలేదు.. ఒక రాత్రంతా గడపమన్నాడు.. దివ్యాంక త్రిపాఠి

Advertiesment
Divyanka Tripathi
, సోమవారం, 31 జనవరి 2022 (18:37 IST)
Divyanka Tripathi
క్యాస్టింగ్ కౌచ్ సినీ ఇండస్ట్రీలో పెను సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై ఇప్పటికే చాలామంది స్పందించారు. ఎంతోమంది డైరక్టర్లు తమ పట్ల ఇబ్బందికరంగా ప్రవర్తించారంటూ హీరోయిన్లు కామెంట్స్ చేశారు. 

 
తాజాగా మీ టూ కన్నా ముందే తనకి క్యాస్టింగ్ కౌచ్ అనుభవం ఎదురైందని.. హిందీ బుల్లితెర నటి దివ్యాంక త్రిపాఠి చెప్పుకొచ్చింది. తాజాగా ఓ ఇంటర్వూలో మాట్లాడిన దివ్యాంక తన క్యాస్టింగ్ కౌచ్ అనుభవం గురించి చెప్పుకొచ్చింది.

 
ఒక సీరియల్‌ లేదా షో పూర్తి చేశాక నటులకు అసలైన కష్టం మొదలవుతుందని.. చేతిలో చిల్లిగవ్వ కూడా లేని పరిస్థితి ఏర్పడుతుందని, తనకు కూడా అలాగే ఒకసారి బిల్స్‌, ఈఎమ్‌ఐ కూడా కట్టలేని స్థితిలో.. చేతిలో డబ్బుల్లేక ఇంకా సరైన ఆఫర్లు రాక తీవ్ర ఒత్తిడికి లోనయ్యాయని వెల్లడించింది.

 
ఆ సమయంలో ఒక ఆఫర్‌ వచ్చిందని.. తీరా అక్కడకి వెళ్ళాక.. నువ్వు డైరెక్టర్‌తో ఒక రాత్రంతా గడిపితే నీకు మంచి అవకాశం ఇస్తాడని ఒక వ్యక్తి చెప్పడంతో షాక్ తిన్నానని చెప్పుకొచ్చింది.

 
అడిగినదానికి ఒప్పుకోకపోతే కెరీర్ నాశనం చేస్తాము అంటూ బెదిరింపులకు కూడా పాల్పడ్డారని తెలిపింది. ఇక అంగీకరించకపోతే కెరీర్‌ నాశనమవుతుందని బెదిరింపులకు దిగుతారు. ఇలాంటి బెదిరింపులకు ఎప్పుడూ లొంగలేదు.

 
అంతేకాదు దీన్ని ఎప్పుడూ సీరియస్‌గా కూడా తీసుకోలేదు. తన ప్రతిభను నమ్ముకుని పైకొచ్చానని చెప్పుకొచ్చింది. మే తేరి దుల్హన్ అనే సీరియల్‌లో నటించి ఎంతగానో పాపులర్ అయిన ఈ ముద్దుగుమ్మ ఇలా ఎన్నో సీరియల్‌లో నటించి ఆకట్టుకుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విజయ్ దేవరకొండ తుఫాన్‌గా పేరు మార్చుకున్న రౌడీ హీరో!