టాలీవుడ్ సెన్సేషనల్ హీరో, రౌడీ హీరో విజయ్ దేవరకొండ ట్విట్టర్‌లో పేరు మార్చుకున్నాడు. పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి, గీత గోవిందం లాంటి సినిమాలతో యూత్ హీరోగా మంచి పాపులారిటీ తెచ్చుకున్న విజయ్‌కి సోషల్ మీడియాలో వున్న క్రేజ్ అంతా ఇంతా కాదు.
ప్రస్తుతం టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్‌తో..లైగర్ అనే సినిమా చేస్తున్న ఈ యంగ్ హీరో.. మళ్లీ ఆయన డైరెక్షన్‌లోనే మరో సినిమా కూడా తీయ్య బోతున్నాడంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఇవే కాకుండా పలు సంస్ధలకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నాడు.
ఇంతకాలంగా విజయ్ దేవరకొండగా తెలిసిన ఈ హీరో పేరు మార్చుకున్నాడు. లేటెస్ట్ అప్‌డేట్‌ల ప్రకారం సూపర్ స్టార్ మహేష్ బాబు చేస్తున్న ఓ పాపులర్ యాడ్‌లో విజయ్ దేవరకొండ కనిపించనున్నాడట. దీంతో మహేష్ బాబు థమ్స్ అప్ యాడ్ కూడా విజయ్ దేవరకొండ చేతికి రానుంది.
ఈ నేపథ్యంలో సోషల్ మీడియా హ్యాండిల్ పేరును "విజయ్ దేవరకొండ తుఫాన్"గా ఛేంజ్ చేశాడు ఈ రౌడీ హీరో. ఇక యాడ్ కూడా ట్విట్టర్‌లో తుఫాన్ సృష్టిస్తోంది.