Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నిరుత్సాహపూరితంగా వినియోగదారులు, వ్యాపార సంస్థలకు 216 బిలియన్‌ డాలర్ల నష్టం: క్వాలిట్రక్స్‌ అధ్యయనం

నిరుత్సాహపూరితంగా వినియోగదారులు, వ్యాపార సంస్థలకు 216 బిలియన్‌ డాలర్ల నష్టం: క్వాలిట్రక్స్‌ అధ్యయనం
, గురువారం, 9 డిశెంబరు 2021 (17:25 IST)
దాదాపుగా భారతదేశంలోని వినియోగదారులందరూ (96%) వెల్లడించేదాని ప్రకారం 2021లో వినియోగదారునిగా తాము అసంతృప్తిని ఎదుర్కొన్నామని  చెబుతున్నారని క్వాలిట్రక్స్‌ 2022 గ్లోబల్‌ కన్స్యూమర్‌ ట్రెండ్‌ రిపోర్ట్‌ నేడు వెల్లడించింది.  ఇది భారతదేశంలో వ్యాపార సంస్థలకు 216 బిలియన్‌డాలర్ల మేర నష్టం కలిగించింది. అంతేకాదు, తాము ఎదుర్కొన్న అసంతృప్తి కారణంగానే తాము చేసే ఖర్చును తగ్గించుకున్నామని మూడొంతుల మంది వెల్లడిస్తున్నారని ఆ అధ్యయనం వెల్లడించింది.

 
వ్యాపార సంస్థలు మెరుగుపరుచుకోవాల్సిన అతి ముఖ్యమైన విభాగంగా వినియోగదారుల సేవలని పేర్కొన్న స్పందనదారులు, అనుసరించి ధరలు, ఫీజులు ఉంటాయని వెల్లడించారు. ఆన్‌లైన్‌ రిపోర్శెస్‌, మెరుగైన కమ్యూనికేషన్‌ సైతం మెరుగుపరచాలని వెల్లడించారు. స్పందనదారులలో మూడొంతుల మంది వెల్లడించే దాని ప్రకారం వ్యాపార సంస్ధలు తమను జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉందని 74% అంటుంటే, తమ అభిప్రాయాలకు విలువనివ్వాలని 72% మంది చెబుతున్నారు.

 
కంపెనీలు తమకు మెరుగైన సేవలనందిస్తే తాము మరింతగా ఖర్చు చేస్తామని 81% మంది చెబుతున్నారు. క్వాలి్ట్రక్స్‌ ఎక్స్‌ఎం ఇనిస్టిట్యూట్‌ అధ్యయనం వెల్లడించే దాని ప్రకారం భారతదేశంలో పునః కొనుగోళ్లు చేయడంతో పాటుగా తాము సానుకూల అనుభవాలను పొందితే కంపెనీను ఇతరులకు సూచిస్తామంటున్నారు.

 
‘‘భారతదేశ వ్యాప్తంగా సంస్థలు తమ డిజిటల్‌ సామర్థ్యాలను వృద్ధి చేసుకుంటున్న వేళ, వినియోగదారులతో ఉద్యోగులను విడదీస్తున్న అంశాలతో పాటుగా వినియోగదారులకు అందిస్తున్న సేవలకు అమిత ప్రాధాన్యతనివ్వాల్సి ఉంది.  ప్రతి పని లేదంటే శాఖలో అనుభవం అనేది అత్యంత  కీలకమైంది’’ అని నవ్నీత్‌ నరులా, కంట్రీ మేనేజర్‌ ఫర్‌ ఇండియా, క్వాలిట్రక్స్ అన్నారు.

 
ఆయనే మాట్లాడుతూ, ‘‘ప్రస్తుతం కంపెనీలు ఎదుర్కొంటున్న మ్యాక్రో ఎకనమిక్‌ సవాళ్లను అధిగమించాల్సి ఉంటుంది. భారతదేశంలో 2022 సంవత్సరంను చూస్తే , క్వాలిట్రక్స్‌ ఇప్పుడు అన్ని రకాల సంస్ధలతోనూ కలిసి పనిచేయడంపై దృష్టి సారించింది’’ అని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కంప్టీ గార్డ్స్ రెజిమెంటల్ సెంటర్‌లో సైనికాధికారులకు ఘన నివాళి