దేశంలో కొత్తగా మరో 9,419 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో ఈ కేసులు నమోదైనట్టు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదలు చేసిన ఒక పత్రికా ప్రకటనలో పేర్కొంది.
అలాగే, గడిచిన 24 గంటల్లో ఈ వైరస్ బారి నుంచి మరో 8,251 మంది కోలుకున్నారు. అలాగే, కరోనా వైరస్ సోకి 159 మంది మృత్యువాతపడ్డారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 94,742 యాక్టివ్ కేసులు ఉన్నాయి. వీరంతా ఆయా ఆస్పత్రులు, క్వారంటైన్లలో చికిత్స పొందుతున్నారు.
ఇదిలావుంటే, దేశ వ్యాప్తంగా ఇప్పటివరకు 3,40,97,388 మంది కోలుకున్నారు. అలాగే, 4,74,111 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశ వ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగంగా 130.39 కోట్ల డోసుల వ్యాక్సిన్లు వేశారు.