Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.48 కోట్లతో ఖరీదైన ఆఫీసు.. ధనిక నటిగా అవతరించడమే లక్ష్యం (video)

Webdunia
శనివారం, 30 మే 2020 (14:02 IST)
హిందీ చిత్ర పరిశ్రమలో డేరింగ్, డాషింగ్ హీరోయిన్లలో ఒకరు కంగనా రనౌత్. ఆమె మాట్లాడే మాటేకాదు.. చేసే చర్య కూడా చర్చనీయాంశంగా ఉంటుంది. అందుకు ఉదాహరణే గతంలో అనేక బోల్డ్ క్యారెక్టర్లలో నటించింది. వాటిపై ఎన్ని విమర్శలు వచ్చినా ధీటుగా ఎదుర్కొంది. అనేక వివాదాస్పద చిత్రాలను నిర్మించింది. అలాంటి కంగనా రనౌత్.. ఇపుడు ప్రతి ఒక్కరూ ఆశ్చర్యానికి లోనయ్యేలా రూ.48 కోట్ల వ్యయంతో ఓ ఖరీదైన ఆఫీసును ప్రారంభించింది. ఇపుడు సోషల్ మీడియాలో ఈ ఆఫీసుకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అయింది. 
 
ఈ సందర్భంగా కంగనా రనౌత్ మాట్లాడుతూ, చేతిలో కేవలం రూ.1500తో ఇంటి నుంచి బయటకు వచ్చాను. డబ్బు సంపాదించడానికే మా ఊరు నుంచి ముంబై వచ్చాను. పురుషాధిక్య సమాజంలో ఓ మహిళ డబ్బు సంపాదిస్తే జీర్ణించుకోలేరు. ఎన్నో పోరాటాల తర్వాత పెద్ద స్టార్‌గా ఎదిగానని తెలిపింది. 50 ఏళ్ల వయసు వచ్చేసరికి అత్యంత ధనికురాలిగా నిలవడమే తన లక్ష్యమని చెప్పుకొచ్చింది. 
 
కాగా, బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో పురుషాధిక్యత అధికం. అలాంటి రంగంలో ఓ మహిళగా తనదైన ముద్రను వేసింది. స్టార్ కిడ్‌గా ఎంట్రీ ఇవ్వకపోయినా అంచలంచెలుగా అగ్ర నటిగా ఎదిగింది. ముఖ్యంగా, ఇతరులు నిర్మాతగా, దర్శకురాలిగా కూడా రాణిస్తోంది. ఏది ఏమైనా.. కంగనా అంటే ఓ ట్రెండ్ సెట్టర్. 
 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మతాంతర వివాహం చేసుకుందని కుమార్తెను ఇంటికి పిలిచి చంపేశారు... ఎక్కడ?

శ్రీవర్షిణి మెడలో మూడు ముళ్లు- వైభవంగా అఘోరీ శ్రీనివాస్ పెళ్లి (video viral)

చిన్నారిపై హత్యాచారం చేసిన నిందితుడి ఎన్‌కౌంటర్: PSI అన్నపూర్ణకు అభినందనలు

పంచ్‌లు - కిక్‌లు లేకుండా నిస్సారంగా సాగిన రోబోల బాక్సింగ్ (Video)

కారు డోర్ లాక్ : ఊపిరాడక అక్కా చెల్లెళ్లు మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

తర్వాతి కథనం
Show comments