Webdunia - Bharat's app for daily news and videos

Install App

కంగనా రనౌత్‌కు మళ్లీ చుక్కెదురు.. ఏమైందంటే?

Webdunia
బుధవారం, 18 నవంబరు 2020 (13:44 IST)
బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌కు మళ్లీ చుక్కెదురైంది. కంగనా రనౌత్‌కు ముంబై పోలీసులు బుధవారం సమన్లు జారీ చేశారు. ఆమె సోదరి రంగోలీ చందేల్ కూడా ఈనెల 23, 24వ తేదీల్లో తమ ముందు హాజరుకావాలంటూ ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. మతఘర్షణలు రెచ్చగొట్టే రీతిలో ఇటీవల సోషల్ మీడియాలో కంగనా, ఆమె సోదరి అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
 
ఈ కేసులో బాంద్రా పోలీస్ స్టేషన్ ఎదుట హాజరుకావాలని ముంబై పోలీసులు నోటీసులు ఇచ్చారు. తొలుత అక్టోబర్ 26, 27, ఆ తర్వాత నవంబర్ 9, 10 తేదీల్లో హాజరుకావాలంటూ కంగనకు సమన్లు జారీ చేశారు. కానీ రెండుసార్లు వాళ్లు హాజరుకాలేదు. ఇంట్లో పెళ్లి ఉన్న కారణంగా హాజరుకాలేనని.. నవంబర్ 15వ తేదీ తర్వాత హాజరుకానున్నట్లు ఆమె చెప్పారు.
 
కంగనా, ఆమె సోదరి చేసిన ట్వీట్లపై బాలీవుడ్ క్యాస్టింగ్ డైరక్టర్, ఫిట్‌నెస్ ట్రైనర్ మునావర్ అలీ సయ్యద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే ఆ ఫిర్యాదను పరిశీలించాలని బాంద్రా మెజిస్ట్రేట్ కోర్టు పోలీసుల్ని ఆదేశించింది. ఐపీసీ 153-ఏ, 295-ఏ, 124-ఏ, 34 సెక్షన్ల కింద కేసు బుక్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

తర్వాతి కథనం
Show comments