Webdunia - Bharat's app for daily news and videos

Install App

అషు రెడ్డితో రిలేషన్‌లో వున్న రాహుల్ సిప్లగింజ్

Webdunia
బుధవారం, 18 నవంబరు 2020 (12:38 IST)
Rahul Sipligunj_Ashu Reddy
బిగ్ బాస్ మూడో సీజన్ విన్నర్ రాహుల్ సిప్లగింజ్ తన ప్రేయసి ఎవరో బయటపెట్టేశాడు. టాలీవుడ్ సింగర్‌గా మంచి క్రేజ్ సొంతం చేసుకున్న రాహుల్ సిప్లిగంజ్ బిగ్ బాస్ రియాలిటీ షోతో ఆ క్రేజ్ ను మరింత పెంచుకున్నాడు. బిగ్ బాస్ హౌస్ లో ఉన్నంతవరకు ఆట ఆడుతూ ప్రేక్షకులను పాటలు పడుతూ పునర్నవిని ఇంప్రెస్ చేసాడు రాహుల్. రాహుల్ పునర్నవి లవ్ ట్రాక్ బిగ్ బాస్ సీజన్‌కే హైలెట్ గా నిలిచింది. 
 
హౌస్‌లో ఈ ఇద్దరు చేసిన హడావిడి అంతా ఇంతాకాదు. ఇక రాహుల్ బిగ్ బాస్ విన్నర్ అయ్యాడు. ఆతర్వాత కూడా రాహుల్ పునర్నవి రిలేషన్‌లో ఉన్నారని చాలా పుకార్లు వచ్చాయి. కానీ ఇటీవలే పునర్నవి నిశ్చితార్థం జరిగినట్లు ఫోటోలు షేర్ చేసింది. ఇదే బాటలో తాజాగా రాహుల్ నెటిజన్స్ షాక్ ఇచ్చాడు. మరో బిగ్ బాస్ బ్యూటీ‌తో రిలేషన్ లో ఉన్నానని ప్రకటించాడు. బిగ్ బాస్ కంటెస్టెంట్ అషు రెడ్డితో రిలేషన్‌లో ఉన్నట్లుగా సోషల్ మీడియా ద్వారా తెలిపాడు రాహుల్. బ్యాక్ టు అవర్ రియల్ రిలేషన్ షిప్ అంటూ ఓ ఫొటోను షేర్ చేసిన రాహుల్ అందరిని ఆశ్చర్యపరిచాడు.
 
బిగ్ బాస్ సీజన్-2 కంటెస్టెంట్ అయిన అషు రెడ్డికి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. అయితే పునర్నవి ఇటీవల ఎంగేజ్మెంట్ అంటూ ఓ ఫోటో పెట్టి ఆ తర్వాత తూచ్ ఇదిఅంతా వెబ్ సిరీస్ ప్రమోషన్ కోసమే అంటూ చెప్పుకొచ్చింది.. ఇప్పుడు రాహుల్ రియల్ రిలేషన్ అంటూ పోస్ట్ పెట్టిన ఇదికూడా ఏదైనా పబ్లిసిటీ స్టంట్ అయ్యి ఉంటుందని కొంతమంది అభిప్రాయపడుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నిత్య పెళ్లికూతురు - 15 యేళ్లలో 8 మందిని పెళ్లాడిన కి'లేడీ' టీచర్..

Annadata Sukhibhava: ఆగస్టు 2న అన్నదాత సుఖీభవ పథకం అమలు.. చంద్రబాబు

ప్రకృతిలో అమరావతిగా ఏపీ రాజధాని మోడల్ గ్రీన్ సిటీగా మార్చాలి: చంద్రబాబు

24 క్యారెట్ల బంగారం- ఆపరేషన్ సింధూర్.. అగ్గిపెట్టెలో సరిపోయేలా శాలువా.. మోదీకి గిఫ్ట్

దేవెగౌడ ఫ్యామిలీకి షాక్ : అత్యాచార కేసులో దోషిగా తేలిన రేవణ్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

తీపి మొక్కజొన్న తింటే?

తర్వాతి కథనం
Show comments