Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆస్పత్రిలో చేరిన నటుడు కమల్ హాసన్.. ఎందుకో తెలుసా?

Webdunia
సోమవారం, 17 జనవరి 2022 (15:28 IST)
సినీ నటుడు కమల్ హాసన్ మరోమారు ఆస్పత్రిలో చేరారు. చెన్నై పోరూరులో ఉన్న శ్రీరామచంద్ర మెడికల్ రీసెర్చ్ సెంటరులో ఆయన వైద్య పరీక్షల కోసం సోమవారం అడ్మిట్ అయ్యారు. రెగ్యులర్ పరీక్షల కోసమే ఆయనకు ఆస్పత్రికి వెళ్లారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ పరీక్షలు జరిపిన తర్వాత ఆయన్ను ఇంటికి పంపించనున్నారు. 
 
కాగా, ఇటీవల అమెరికా వెళ్లి వచ్చిన కమల్ హాసన్‌కు కరోనా వైరస్ సోకిన విషయం తెల్సిందే. దీంతో దాదాపు పది రోజులకు పైగా ఆస్పత్రిలోనే ఉండి చికిత్స తీసుకున్నారు. ఆ తర్వాత తమిళ బిగ్ బాస్ ఫైనల్‌కు హాజరయ్యారు. ఆస్పత్రి నుంచి నేరుగా ఆయన 'బిగ్ బాస్' హౌస్‌కే వెళ్లడం కోవిడ్ ప్రొటోకాల్స్‌కు విరుద్ధమని పేర్కొంటూ ప్రభుత్వం ఆయనకు నోటీసులు జారీచేసింది. 
 
ఈ నేపథ్యంలో ఆయన సోమవారం మరోమారు ఆస్పత్రికి వెళ్లారు. రెగ్యులర్ వైద్య పరీక్షల కోసం వెళ్లారు. అయితే, వైద్యులు మాత్రం దీనిపై ఓ క్లారిటీ మాత్రం ఇవ్వడం లేదు. అంటే, ఆస్పత్రి వైద్యులు హెల్త్ బులిటెన్‌ను ఇంకా రిలీజ్ చేయకపోవడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అమెరికాలో పార్ట్‌టైమ్ ఉద్యోగాలు చేస్తున్నారు.. అయితే, దేశ బహిష్కరణ వేటు

స్కూటీపై వెళుతున్న వివాహితకు నిప్పంటించిన అకతాయి... మంటల్లో కాలుతూనే...

కొండారెడ్డిలో రోడ్డు విస్తరణ - సీఎం రేవంత్ రెడ్డి ప్రహరీ కూల్చివేత

అమ్మాయి కోసం ముగ్గురు యువకుల గొడవ... ఆటోవాలాను రైలు కింద తోసేసి...

ఉపరాష్ట్రపతి ఎన్నికకు సర్వంసిద్ధం - పోటీలో ఉన్నది ఎవరో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మీరు మద్యం సేవిస్తున్నారా? అయితే, ఈ ఫుడ్ తీసుకోవద్దు

పచ్చి ఉల్లిపాయలు తినడం వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి?

బీపీ వున్నవారు ఏమేమి తినకుండా వుండాలి?

ఆధునిక వాస్కులర్ సర్జరీ అవయవాలు, ప్రాణాలను ఎలా కాపాడుతుంది?

ఫ్లూ నుంచి రక్షణ కోసం ట్రైవాలెంట్ ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్‌ను విడుదల చేసిన జైడస్ వాక్సిఫ్లూ

తర్వాతి కథనం
Show comments