Webdunia - Bharat's app for daily news and videos

Install App

వారి భార్యలు నిజంగానే గ్రేట్.. భర్తలకు ఆ స్వేచ్ఛ ఇచ్చారు: చిన్మయి

Webdunia
సోమవారం, 17 జనవరి 2022 (13:15 IST)
మీటూ, క్యాస్టింగ్ కౌచ్ ఉద్యమంలో భాగస్వామ్యం అవుతూ సంచలన విషయాలతో హాట్ టాపిక్ అయ్యారు సింగర్ చిన్మయి. సోషల్ మీడియాలో ఎప్పూడు యాక్టివ్‌గా వుండే ఈ సింగర్ తనదైన స్టైల్‌లో మహిళలపై జరుగుతున్న లైంగింక వేధింపులను అడ్రెస్ చేస్తూ అవసరమున్నవారికి అండగా ఉంటోంది.
 
ఇక కాంట్రవర్షియల్ మ్యాటర్ లో ఎప్పుడు ముందుండే చిన్మయి రీసెంట్‌గా చేసిన పోస్ట్ నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. జనరల్గా ఆడవాళ్లు పెళ్లైన తరువాత ఏ జాబ్ చేసినా, బయటకు వెళ్లినా.. ఎంతో ఎత్తుకు ఎదిగినా ఆ క్రేడిట్ అంతా కూడా భర్తకు ఇస్తుంటారు. అంతేనా మీ భర్త చాలా గ్రేట్.. మిమ్మల్ని ఇలా పని చేసుకోవడానికి ఒప్పుకున్నారు. బయటకు పంపారు.. అంటూ కొన్ని మాటలు వినిపిస్తుంటాయి.
 
ఇలాంటి మాటలకు దర్శకురాలు సుధా కొంగర గట్టి సమాధనం ఇచ్చింది. "నేను నాకు ఇష్టమైన పని చేయడానికి నాకు ఎవరూ పర్మిషన్ గానీ.. అంగీకారాన్ని గానీ ఇవ్వలేదు. నాకు నచ్చింది నేను చేస్తున్నాను" అంటుంటారు సుధా కొంగర. 
 
ఇక ఇదే విషయంపై తనదైన స్టైల్లో స్పంధించింది సింగర్ చిన్మయి. సుధా కొంగర చెప్పిన మాటలకు తన శైలిని జోడించి మరీ కౌంటర్ వేశారు. సోషల్ మీడియా వేదికగా ఆమె స్పందిస్తూ.."సినిమా దర్శకులు, నటులు, సంగీత దర్శకులు, క్రియేటర్స్, లాయర్స్, డాక్టర్స్, పొలిటిషియన్స్ భార్యలు నిజంగానే గ్రేట్.. మీరు మీ భర్తలకు పని చేసుకునే స్వేచ్చను, పర్మిషన్ ఇచ్చారు " అంటూ సెటైర్ వేసింది. ఇక సింగర్ చిన్మయి పోస్టుకు పెద్ద ఎత్తున మద్దతు తెలుపుతున్నారు నెటిజన్స్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆరుముళ్లతో ఒక్కటైన ట్రిపుల్: జీవితాంతం అంత ఈజీ కాదురా బాబ్జీ (video)

హైదరాబాద్‌ను ఎవరు డెవలప్ చేశారని గూగుల్ అంకుల్‌‌ను అడగండి? సీఎం చంద్రబాబు

మయన్మార్‌లో భారీ భూకంపం.. పెరుగుతున్న మృతుల సంఖ్య

ఎన్‌కౌంటర్‌ నుంచి తప్పించుకున్నా... ఇది పునర్జన్మ : మంత్రి సీతక్క (Video)

గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసు : వల్లభనేని వంశీకి మళ్లీ నిరాశ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

తర్వాతి కథనం
Show comments