Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోలీవుడ్ చరిత్రలో అత్యధిక మంది వీక్షించిన చిత్రంగా "విక్రమ్"

Webdunia
శుక్రవారం, 23 సెప్టెంబరు 2022 (17:21 IST)
విశ్వనటుడు కమల్ హాసన్, యువ దర్శకుడు లోకేష్ కనకరాజ్ కాంబినేషన్‌లో వచ్చిన "విక్రమ్" చిత్రం సరికొత్త రికార్డులను నెలకొల్పింది. వందేళ్ళ తమిళ చిత్రపరిశ్రమలో అత్యధిక మంది ప్రేక్షకులు థియేటర్‌లో వీక్షించిన చిత్రంగా రికార్డు సృష్టించింది. 
 
గత జూన్ నెల మూడో తేదీన విడుదలైన ఈ చిత్రం భారతీయ బాక్సాఫీస్ వద్ద సంచ‌ల‌నాలు సృష్టించింది. త‌మిళంలో 'బాహుబ‌లి-2' రికార్డును బ్రేక్ చేసి ఇండ‌స్ట్రీహిట్‌గా నిలిచింది. విడుద‌లైన అన్ని ఏరియాల్లో డ‌బుల్ బ్లాక్ బ‌స్టర్‌గా నిలిచింది. చాలా కాలం త‌ర్వాత క‌మ‌ల్‌కు విక్రమ్‌ సినిమా భారీ విజ‌యాన్నించింది. 
 
ఇక‌ దాదాపు నాలుగేళ్ళ త‌ర్వాత క‌మ‌ల్ వెండితెర‌పై క‌నిపించ‌డంతో అభిమానులు సంబురాలు చేసుకున్నారు. అందులో అవుట్ అండ్ అవుట్ యాక్షన్‌ సినిమాను చేయ‌డంతో ఫ్యాన్స్ సంతోషానికి అవదుల్లేకుండా పోయాయి.
 
ఇదిలా ఉంటే తాజాగా 'విక్రమ్‌' సినిమా థియేట్రికల్‌ రన్‌ పూర్తయింది. ఈ సినిమా కోయంబత్తూర్‌లోని కేజీ సినిమాస్‌ థియేటర్‌లో 113 రోజులు ప్రదర్శితమైంది. ఈ మధ్యకాలంలో ఒక సినిమా నెల రోజులు థియేటర్‌లో ఆడితే అది గొప్ప విషయం. అలాంటి విక్రమ్‌ చిత్రం ఏకంగా 113 రోజులు ప్రదర్శితమయిందంటే ఈ సినిమా క్రేజ్‌ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. 
 
వందేళ్ళ ఏళ్ళ కోలీవుడ్‌ ఇండస్ట్రీ చరిత్రలోనే అత్యధిక మంది వీక్షించిన తమిళ సినిమాగా విక్రమ్‌ మూవీ రికార్డు క్రియేట్‌ చేసింది. ఇక ఈ చిత్రం ఫైనల్‌గా రూ.450 కోట్లకు పైగా కలెక్ట్‌ చేసి కోలీవుడ్‌లో హైయ్యస్ట్ షేర్‌ సాధించిన సినిమాగా నిలిచింది.
 
యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్‌గా తెర‌కెక్కిన ఈ చిత్రంలో మ‌ల‌యాళ స్టార్ ఫాహాద్ ఫాజిల్‌, తమిళ స్టార్ విజ‌య్ సేతుప‌తి కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. సూర్య రోలెక్స్ పాత్ర‌లో 5 నిమిషాలు మెరిసాడు. సూర్య పాత్ర సినిమాకే హైలేట్ అని చెప్ప‌వ‌చ్చు. అనిరుధ్ ర‌విచంద్ర‌న్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని రాజ్ క‌మ‌ల్ ఫిలింస్ ఇంట‌ర్నేష‌న‌ల్ బ్యాన‌ర్‌పై ఆర్. మహేంద్ర‌న్‌తో క‌లిసి క‌మ‌ల్ స్వీయ నిర్మాణంలో తెర‌కెక్కించాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అదానీ ఇచ్చిన రూ. 100 కోట్లు విరాళం నిరాకరిస్తున్నాం: సీఎం రేవంత్ రెడ్డి

ఆక్సిజన్ కొరత.. కవలపిల్లలు అంబులెన్స్‌లోనే చనిపోయారా?

అల్పపీడనం: నవంబర్ 26 నుంచి 29 వరకు ఏపీలో భారీ వర్షాలు (video)

జ్వరంతో విద్యార్థిని మృతి.. టీచర్లపై కేసు నమోదు.. ఎందుకని?

జైలుకు వెళ్లినలారంతా సీఎం అయ్యారనీ.. ఆ లెక్కన కేటీఆర్‌కు ఆ ఛాన్స్ రాదు : సీఎం రేవంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం
Show comments