Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

దేవీ
శుక్రవారం, 28 మార్చి 2025 (19:11 IST)
Nandamuri Kalyan Ram dance
నందమూరి కళ్యాణ్ రామ్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ అర్జున్ S/O వైజయంతి. ఈ చిత్రంలో విజయశాంతి పవర్ ఫుల్ పాత్రలో కనిపిస్తున్నారు. ఈ యాక్షన్-ప్యాక్డ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో ఈ రెండు పాత్రలు మధ్య డైనమిక్స్ కీలకంగా వుండబోతున్నాయి. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహించి ఈ చిత్రాన్ని అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌లపై అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మించారు. ఇటివలే రిలీజ్ చేసిన టీజర్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు మేకర్స్ మ్యూజిక్ ప్రమోషన్స్ ని కిక్ స్టార్ట్ చేయబోతున్నారు.
 
ఈ సినిమా ఫస్ట్ సింగిల్ నయాల్ది సాంగ్ ని మార్చి 31న రిలీజ్ చేస్తున్నారు. కళ్యాణ్ రామ్ స్టన్నింగ్ క్లాస్ లుక్‌లో, ఉర్రూతలూగించే మాస్ డ్యాన్స్ చేస్తూ కనిపించిన పోస్టర్ అదిరిపోయింది. బ్యాక్ డ్రాప్ లో కార్నివాల్ వాతావరణం, డ్యాన్స్ ట్రూప్ పండుగ వైబ్ ని పెంచుతోంది. నాయల్ది మాస్ డ్యాన్స్ నంబర్ అని పోస్టర్ సూచిస్తోంది. ఈ సినిమా కోసం అజనీష్ లోక్‌నాథ్ బ్లాక్ బస్టర్ ఆల్బమ్ కంపోజ్ చేశారు.
 
ఈ చిత్రంలో సోహైల్ ఖాన్, సాయి మంజ్రేకర్, శ్రీకాంత్, యానిమల్ పృథ్వీవీరాజ్  కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
 
ఈ చిత్రానికి రామ్ ప్రసాద్ సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తున్నారు. ఎడిటింగ్ తమ్మిరాజు నిర్వహించగా, స్క్రీన్‌ప్లేను శ్రీకాంత్ విస్సా రాశారు.
 
ఈ సినిమా రిలీజ్ డేట్ ని మేకర్స్ త్వరలో అనౌన్స్ చేస్తారు.
 
నటీనటులు: నందమూరి కళ్యాణ్ రామ్, విజయశాంతి, సోహైల్ ఖాన్, సాయి మంజ్రేకర్, శ్రీకాంత్, యానిమల్ పృథ్వీవీరాజ్   

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

శ్రీలంక తీరంలో తీవ్ర వాయుగుండం - దిత్వాహ్‌గా నామకరణం

Vizag: వైజాగ్‌లో 400 ఎకరాల్లో రిలయన్స్ డేటా సెంటర్

ఆ ఆటో డ్రైవర్ నిజాయితీకి నిలువుటద్దం... బ్యాగు నిండా డబ్బు దొరికినా... (వీడియో)

అమరావతిలో రూ.260 కోట్లతో శ్రీవారి ఆలయం.. శంకుస్థాపన చేసిన ఏపీ సీఎం చంద్రబాబు

సర్పంచ్ కుర్చీ కోసం ఆగమేఘాలపై వివాహం - తీరా చూస్తే ఆశలు గల్లంతయ్యాయి..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

తర్వాతి కథనం
Show comments