Webdunia - Bharat's app for daily news and videos

Install App

‘కల్కి 2898 AD లో అశ్వత్థామగా యుద్ధానికి సిద్ధమైన అమితాబ్ బచ్చన్ న్యూ పోస్టర్

డీవీ
శుక్రవారం, 7 జూన్ 2024 (16:24 IST)
Ashwatthama New Poster
మోస్ట్ ఎవైటెడ్ అప్ కమింగ్ ఫిక్షన్ ఎపిక్ ‘కల్కి 2898 AD’ భారీ అంచనాలతో కూడిన ట్రైలర్ విడుదలకు కేవలం మూడు రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో, మేకర్స్ మూవీపై వున్న ఎక్సయింట్ ని నెక్స్ట్ లెవల్ కి తీసుకెలుతున్నారు. ఈరోజు, మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ తన అశ్వత్థామ అవతార్ లోఉన్న కొత్త పోస్టర్‌ను సోషల్ మీడియాలో లాంచ్ చేశారు. అమితాబ్ యుద్దభూమి మధ్యలో నిలబడి, అస్త్రాన్ని పట్టుకుని, నుదిటిపై ఒక దివ్య రత్నాన్ని ధరించి, యుద్ధానికి సిద్ధంగా వున్నట్లుగా కనిపించారు. అతని వెనుక ఒక లైఫ్ సైజు వెహికిల్ తో పాటు కొంతమంది వ్యక్తులు నేలపై పడివుండటం గమనించవచ్చు.
 
“అతని నిరీక్షణ ముగుస్తోంది... మూడు రోజుల్లో #Kalki2898AD ట్రైలర్, జూన్ 10న విడుదల” అని సోషల్ మీడియాలో షేర్ చేశారు మేకర్స్.  
 
అమితాబ్ బచ్చన్ అశ్వత్థామ పాత్ర మధ్యప్రదేశ్‌లోని నెమావార్, నర్మదా ఘాట్ వద్ద ఒక మ్యాసీవ్ ప్రొజెక్షన్ ద్వారా లాంచ్ చేశారు. ఈ సందర్భంగా నెమవార్, నర్మదా ఘాట్‌ల ఎంచుకోవడం గొప్ప ప్రాముఖ్యతను సంతరించుకుంది, ఎందుకంటే అశ్వత్థామ ఇప్పటికీ నర్మదా మైదానంలో నడుస్తాడని నమ్ముతారు. ఈ మూవీ, తన పాత్ర కోసం అభిమానుల్లో మరింత ఎక్సయిట్మెంట్ పెంచింది.
 
'కల్కి 2898 AD' లో ఇండియన్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, ప్రభాస్, దీపికా పదుకొణె, దిశా పటానీ సహా ప్రముఖ నటీనటులు నటిస్తున్నారు. విజనరీ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది.  మల్టీలింగ్వెల్, మైథాలజీ -ఇన్స్ స్పైర్డ్  సైన్స్ ఫిక్షన్ విజువల్ వండర్ ఫ్యూచర్ లో సెట్ చేయబడింది. ఈ చిత్రం 2024 జూన్ 27న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కొండ నాలుకకు మందు ఇస్తే ఉన్న నాలుక ఊడిపోయింది...

కాంగ్రెస్ నేతపై వాటర్ బాటిల్‌తో బీఆర్ఎస్ ఎమ్మెల్యే దాడి

వీధి కుక్కలను వెంటాడి కాల్చిన చంపిన వ్యక్తి, ఎందుకంటే? (video)

ధర్మస్థల కేసులో బిగ్ ట్విస్ట్ - తవ్వకాల్లో బయటపడిన అస్థిపంజరం

తిరుప్పూర్ ఎస్ఐను నరికిచంపిన నిందితుడి కాల్చివేత.. ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments