Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బుజ్జి అండ్ భైరవ యానిమేషన్ సిరీస్ బోల్డ్ అండ్ డేరింగ్ ఎక్స్పరిమెంట్ : నాగ్ అశ్విన్

Advertiesment
Nag Ashwin

డీవీ

, గురువారం, 30 మే 2024 (19:45 IST)
Nag Ashwin
2D యానిమేటెడ్ సిరీస్ బుజ్జి & భైరవ రెబల్ స్టార్ ప్రభాస్ 'కల్కి 2898 AD' మాగ్నమ్ ఓపస్‌కు ప్రీల్యుడ్. ఈ సిరిస్ విజనరీ డైరెక్టర్ నాగ్ అశ్విన్ క్రియేట్ చేసిన కల్కి వరల్డ్ ని, బుజ్జి & భైరవ బ్యాక్ స్టొరీని సినిమా థియేటర్‌లలో విడుదల చేయడానికి ముందు పరిచయం చేయనుంది. మరి కొన్ని గంటల్లో ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల కానుంది. తాజాగా మేకర్స్ ట్రైలర్ ని విడుదల చేశారు.
 
ఫ్యూచర్ వరల్డ్ లో భైరవ ఒక మోటర్‌బైక్‌ను కొనుగోలు చేసి టాప్ బౌంటీ హంటర్‌గా మారాలని ప్లాన్ చేస్తాడు. తన లక్ష్యాన్ని సాధించడానికి బుజ్జి అనే రోబోతో స్నేహం చేస్తాడు. వారు కలిసి ఆటోమొబైల్స్‌లోని అన్ని వేస్ట్ పార్ట్స్ ని రీసైకిల్ చేస్తారు. వారి డ్రీమ్ ని సాధించడానికి 6-టన్నుల బీస్ట్ కార్ ని నిర్మిస్తారు.
 
ట్రైలర్ హ్యూమర్స్, అడ్వంచరస్ గా ఉంది. యానిమేషన్ వర్క్ అద్భుతంగా ఆకట్టుకుంది. వైజయంతీ మూవీస్ ఈ సిరీస్ కోసం గ్రీన్ గోల్డ్ యానిమేషన్‌తో కలిసి పనిచేసింది.
 
బుజ్జి & భైరవ యానిమేషన్ సిరిస్ స్పెషల్ స్క్రీనింగ్ ఈవెంట్ లో డైరెక్టర్ నాగ్ అశ్విన్ మాట్లాడుతూ.. అందరికీ హాయ్. బుజ్జి ఎంట్రీకి ఎంతమంది అరుస్తారు? భైరవ ఎంట్రీకి ఎంతమంది అరుస్తారో అని వెయిట్ చేశాను. వాళ్ళిద్దరూ కలిసినప్పుడు అన్నిటికంటే ఎక్కువ సౌట్ వచ్చింది. సినిమాలో విల్ బి మోర్ ఫన్. మరో ఆరుగంటల్లో ప్రపంచమంతా ఒక గ్లింప్స్ లా మేము క్రియేట్ చేసిన కల్కి వరల్డ్ కి ఒక చిన్న ఎంట్రీ ఇస్తారు. గత నాలుగైదేళ్ళుగా దీని కోసం పని చేస్తున్నాం. సినిమా కంటే ముందే యానిమేషన్ సిరీస్‌ను విడుదల చేయడం మా ప్రొడక్షన్ హౌస్ కి బోల్డ్ అండ్ డేరింగ్ ఎక్స్పరిమెంట్ థింగ్. అన్నిటికంటే ముందు ఒక యానిమేషన్ సిరిస్ తో లాంచ్ అవ్వడం సంథింగ్ న్యూ. రెండేళ్ళ క్రితం ఈ ఐడియా వచ్చింది. ఇది ఎంత కష్టమో తెలియలేదు. కానీ యానిమేషన్ డిఫరెంట్ బాల్ గేమ్. వరల్డ్ వైడ్ గా వున్న యానిమేటర్స్ ని గౌరవించాలి. మేము చోటా భీమ్ తో పాటు ఎన్నో యానిమేషన్ సిరీస్‌లను రూపొందించిన గ్రీన్ గోల్డ్‌తో కలిసి పనిచేశాం. ఛోటా భీమ్ ప్రైడ్ అఫ్ ఇండియా. ఆ సంస్థ మన హైదరాబాద్ లోనే వుంది. వారు ఈ సిరిస్ చేయడానికి అంగీకరించారు. మేము చివరి నిమిషంలో మార్పుల చెప్పినా, వారు ఎప్పుడూ సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. టీమ్‌ మొత్తానికి  ధన్యవాదాలు. మా వరల్డ్ నుంచి మీతో ఒక విషయం షేర్ చేసుకోవాలి. ఈ ఐదేళ్ళలో పార్లల్గా ఒక కార్ తయారు చేశాం. అది మీరంతా చూశారు. ఈ ఐదేళ్ళలో వైజయంతి ఆటోమొబైల్స్, వైజయంతి యానిమేషన్, వైజయంతీ మూవీస్ అనే మూడు డిఫరెంట్ కంపెనీలను నడిపించాం' అన్నారు.  
 
మీడియా, కిడ్స్ కోసం స్క్రీన్ చేసిన మొదటి ఎపిసోడ్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ సిరీస్ ప్రైమ్‌లో 12 AM (మే 31) నుండి అందుబాటులో ఉంటుంది.
 
కల్కి 2898 AD మూవీ జూన్ 27న థియేటర్లలోకి రానుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో దుల్కర్ సల్మాన్.. లక్కీ భాస్కర్ సిద్ధం