Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాజల్ అగర్వాల్ లీడ్ రోల్ గా సత్యభామ

Webdunia
శనివారం, 4 నవంబరు 2023 (18:41 IST)
Kajal Aggarwal
స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ లీడ్ రోల్ లో నటిస్తున్న కొత్త సినిమా “సత్యభామ”. ఈ చిత్రంలో కాజల్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ లో నటిస్తోంది. “సత్యభామ” చిత్రాన్ని అవురమ్ ఆర్ట్స్ పతాకంపై బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి నిర్మిస్తున్నారు. “మేజర్” చిత్ర దర్శకుడు శశికిరణ్ తిక్క సమర్పకులుగా వ్యవహరిస్తూ స్క్రీన్ ప్లే అందించారు. సుమన్ చిక్కాల దర్శకత్వం వహిస్తున్నారు. క్రైమ్ థ్రిల్లర్ కథతో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. దీపావళి పండుగ సందర్భంగా ఈ నెల 11న “సత్యభామ” సినిమా టీజర్ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా
 
నిర్మాత బాబీ తిక్క  మాట్లాడుతూ - మా “సత్యభామ” సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికి దాదాపు 60 శాతం షూటింగ్ పూర్తిచేశాం. ఇటీవలే హైదరాబాద్ లో కాజల్ అగర్వాల్ పాల్గొన్న కీలక సన్నివేశాల తో పాటు యాక్షన్ సీక్వెన్సులు తెరకెక్కించాం. ఈ నెల రెండో  వారం నుంచి కొత్త షెడ్యూల్ ప్రారంభించబోతున్నాము. దీపావళి సందర్భంగా ఈ నెల 11న “సత్యభామ” టీజర్ రిలీజ్ చేస్తాం. వచ్చే సమ్మర్ కు సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నాం. కాజల్ అగర్వాల్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ “సత్యభామ”గా మిమ్మల్ని ఆకట్టుకుంటారు. అన్నారు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారతదేశంలో H125 హెలికాప్టర్ల తయారీ యూనిట్‌- ఏపీలో ఏర్పాటు అవుతుందా?

చిరంజీవి బీజేపీలో చేరే అవకాశం వుందా?

హైదరాబాదులో ఒక అరటిపండు ధర రూ.100లు... రష్యా టూరిస్ట్ వీడియో వైరల్ (video)

Pawan Kalyan: పవన్ కల్యాణ్- నారా లోకేష్‌లతో బండి సంజయ్ (ఫోటో వైరల్)

Pawan Kalyan: జనసేన కార్యాలయంపై డ్రోన్ కలకలం.. భద్రత లోపాలపై పీకే ఫ్యాన్స్ ఆందోళన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరం లావయ్యేందుకు కారణమయ్యే అలవాట్లు ఇవే

నువ్వుండలను తింటున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

భారతదేశంలో సామ్‌సంగ్ హెల్త్ యాప్‌లో వ్యక్తిగత ఆరోగ్య రికార్డుల ఫీచర్‌ను ప్రవేశపెట్టిన సామ్‌సంగ్

యూరిక్ యాసిడ్ ఎలా తగ్గించుకోవాలి?

HMPV వ్యాధి నిరోధించేందుకు చిట్కాలు

తర్వాతి కథనం
Show comments