Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైవాహిక బంధాన్ని తెంచుకున్న కె.రాఘవేంద్ర రావు కొడుకు - కోడలు నిజమా?

Webdunia
శుక్రవారం, 2 ఆగస్టు 2019 (14:39 IST)
తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన అగ్ర దర్శకుడు కె.రాఘవేంద్ర రావు కుటుంబానికి సంబంధించిన ఓ విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని దర్శకేంద్రుడు కోడలే స్వయంగా వెల్లడించింది. రాఘవేంద్ర రావు కుమారుడు, కోడలు తమ వైవాహిక బంధాన్ని తెంచుకున్నారంటూ పలు ఆంగ్ల పత్రికలు, వెబ్ సైట్లు రాశాయి. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, దర్శకుడు కె.రాఘవేంద్ర రావు కుమారుడు ప్రకాష్ కోవెలమూడి గత 2014లో ప్రేమ వివాహం జరిగింది. ఈయన కనిక దిల్లాన్‌ అనే సినీ రచయిత్రిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరూ కలిసి పలు చిత్రాలు కూడా చేశారు. ఈ క్రమంలో తాజాగా బాలీవుడ్ నటి నటి కంగనా రనౌత్ నటించిన "జడ్జిమెంట్ హై క్యా" అనే చిత్రానికి ఈ భార్యాభర్తలిద్దరూ కలిసి పని చేశారు. ఈ చిత్రానికి ప్రకాష్ దర్శకత్వం వహించగా, కనికా దిల్లాన్ రచయిత్రిగా పనిచేశారు. 
 
ఈ క్రమంలో ఆమె తాజాగా ఓ మీడియా సంస్థకు ఇచ్చిన విషయంలో తమ వైవాహిక బంధానికి సంబంధించిన విషయాన్ని బహిర్గతం చేసింది. తామిద్దరం రెండేళ్ల క్రితమే విడిపోయామని, ప్రస్తుతం వేర్వేరుగా జీవిస్తూ, స్నేహితులుగా ఉంటున్నట్టు చెప్పుకొచ్చింది. తామిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతోనే తామిద్దరం పరస్పర అంగీకారంతో విడిపోయినట్టు తెలిపారు. ఈ వార్త టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నారా లోకేష్‌కు ఉప ముఖ్యమంత్రి పదవి.. హోం మంత్రి అనిత ఏమన్నారంటే?

ఆర్జీకర్ వైద్యురాలి హత్య కేసు : ముద్దాయికి ఉరిశిక్ష ఎందుకు విధించలేదు.. కోర్టు వివరణ!

కాపులకు 5 శాతం రిజర్వేషన్లు ఇప్పించాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్‌దే : హరిరామ జోగయ్య.

Monalisa: మహా కుంభ మేళాలో నీలి కళ్ళు చిన్నది.. బ్రౌన్ బ్యూటీ.. వైరల్ గర్ల్ (video)

Greeshma case judgement, ప్రియుడిని గడ్డి మందుతో చంపేసిన ప్రియురాలు: ఉరిశిక్ష విధించిన కేరళ కోర్టు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరం లావయ్యేందుకు కారణమయ్యే అలవాట్లు ఇవే

నువ్వుండలను తింటున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

భారతదేశంలో సామ్‌సంగ్ హెల్త్ యాప్‌లో వ్యక్తిగత ఆరోగ్య రికార్డుల ఫీచర్‌ను ప్రవేశపెట్టిన సామ్‌సంగ్

యూరిక్ యాసిడ్ ఎలా తగ్గించుకోవాలి?

HMPV వ్యాధి నిరోధించేందుకు చిట్కాలు

తర్వాతి కథనం
Show comments