Publish Date: Thu, 14 Mar 2019 (22:03 IST)
Updated Date: Thu, 14 Mar 2019 (22:04 IST)
మెగాస్టార్ మేనల్లుడు సాయిధరమ్ తేజ్ పిల్లా నువ్వు లేని జీవితం, సుప్రీమ్, సుబ్రమణ్యం ఫర్ సేల్ చిత్రాలతో వరుస విజయాలు సాధించి అందరి దృష్టి ఆకర్షించాడు. అయితే... ఆ తర్వాత సరైన కథలు ఎంచుకోకపోవడంతో ఈమధ్య నటించిన తిక్క, విన్నర్, ఇంటిల్ జెంట్, జవాన్, తేజ్ ఐ లవ్ యు చిత్రాలు ఫ్లాప్ అయ్యాయి. తాజాగా చిత్రలహరి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ఇదిలా ఉంటే... తేజు ఇప్పుడు రైటర్‌గా మారబోతున్నాడట.
అవును... తేజు ఓ కథ రాస్తున్నాడట. తన మూవీకి స్వయంగా సాయి ధరమ్ తేజ్ కథను రాసుకోవడం విశేషం. కథ పూర్తైతే స్క్రీన్ ప్లే పనులు మొదలు పెట్టేందుకు రెడీ అవుతున్నాడట సాయి ధరమ్. అంతా బాగానే ఉంది కానీ.. అసలు వరుస ఫ్లాప్‌లతో సతమవుతున్న తేజ్ సడన్‌గా రైటర్‌గా మారడం ఏమిటో అర్ధం కావడం లేదంటున్నారు నెటిజన్లు.
శ్రీ
Publish Date: Thu, 14 Mar 2019 (22:03 IST)
Updated Date: Thu, 14 Mar 2019 (22:04 IST)