Webdunia - Bharat's app for daily news and videos

Install App

'బిగ్‌బాస్' అంటే గంభీరత్వం.. దానికి కరెక్ట్‌గా సరిపోయే హోస్ట్ ఎన్టీఆర్: జ్యోతి

Webdunia
బుధవారం, 6 మార్చి 2019 (17:26 IST)
తెలుగు టీవి చరిత్రలో బిగ్‌బాస్ షో రెండు సీజన్లు పూర్తిచేసుకుంది. ఇప్పుడు మళ్లీ మూడో సీజన్ మొదలుకానుంది. ముఖ్యంగా ఈ సీజన్ కోసం ప్రేక్షకులు ఎంతగానో వేచి చూస్తున్నారు. ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరించిన మొదటి సీజన్‌ సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఈ సీజన్‌తో ఎన్టీఆర్‌పై ప్రశంసల వర్షం కురిసింది. అయితే.. సీజన్ 2 మాత్రం వివాదాస్పదమైంది.
 
నాని హోస్ట్‌గా వ్యవహరించిన ఈ సీజన్‌లో కంటెస్టెంట్స్ మధ్య పెద్ద యుద్ధాలే జరిగాయి. సీజన్ ముగిసిపోయినా కూడా ఇంగా.. కౌశల్ ఆర్మీ రూపంలో బిగ్‌బాస్ వార్తల్లో నిలుస్తూనే ఉంది. ఇదిలా ఉండగా.. బిగ్‌బాస్ 3కి ఎవరు హోస్ట్‌గా వ్యవహరిస్తారనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. స్టార్ నెట్‌వర్క్ మళ్లీ ఎన్టీ‌ఆర్‌నే హోస్ట్‌గా సంప్రదించిందని వార్తలు వచ్చినా అధికారికంగా ఇంకా ఖరారు కాలేదు. 
 
ప్రస్తుతం మరోవైపేమో సీజన్ 3లో పాల్గొనే కంటెస్టెంట్స్ ఎవరనే విషయంపై కూడా చర్చ జరుగుతోంది. దీనిపై నటి జ్యోతి స్పందించారు. తాజాగా ఓ యూట్యూబ్ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సీజన్ 3లో నేను పాల్గొంటున్నానని తన దృష్టికి వచ్చినట్లు చెప్పారు. అలానే బిగ్‌బాస్ 2 సీజన్ల మధ్య వ్యత్యాసాల గురించి మాట్లాడారు.
 
సీజన్ 1తో పోలిస్తే సీజన్ 2 కంటెస్టెంట్స్‌కి చాలా సౌకర్యవంతంగా మారిపోయింది. బిగ్‌బాస్ సీజన్ 1లో అయితే కంటెస్టెంట్స్‌‍లో భయం ఎక్కువగా ఉండేది. ఇందులో జూనియర్ ఎస్టీఆర్ హుందాతనంగా ఉండేవారు. ఆయనంటే భయం ఉండేది మాకు అంటూ.. బిగ్‌బాస్ అంటే గంభీరత్వం.. దానికి కరెక్ట్‌గా సరిపోయే హోస్ట్ ఎన్టీఆర్ అని చెప్పుకొచ్చారు జ్యోతి.
 
కానీ, సీజన్ 2కు వచ్చేసరికి కంటెస్టెంట్స్ చాలా చిల్‌గా ఉన్నారు. సెట్ అన్నపూర్ణ స్టూడియోలో కావడం వారికి బాగా కలిసొచ్చింది. మాకు ఎక్కడో లూనావానాలో కొండపైన పెట్టారు.. అని తన అభిప్రాయాన్ని వెల్లడించారు జ్యోతి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Hyderabad: భూ వివాదం ఒక ప్రాణాన్ని బలిగొంది.. నలుగురు కుమారుల మధ్య..?

భర్త తప్పిపోయాడని క్షుద్ర వైద్యుడి దగ్గరికి వెళ్తే.. అసభ్యంగా ప్రవర్తించాడు.. ఏం చేశాడంటే?

కర్నూలులో వరుస హత్యలు.. భయాందోళనలో ప్రజలు

Heavy rainfall: బంగాళాఖాతంలో అల్పపీడనం- తెలంగాణ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్

Kavitha: కవితకు బిగ్ షాకిచ్చిన కేటీఆర్‌.. పార్టీ నుంచి సస్పెండ్.. హరీష్ ఆరడుగుల బుల్లెట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

డయాబెటిస్ వున్నవారిలో చాలామందికి కిడ్నీలు పాడైపోవడానికి కారణాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments