శుక్రవారం రాత్రి 9 గంటలకు వాఘా సరిహద్దు వద్ద వింగ్ కమాండర్ అభినందన్ ను భారతదేశానికి అప్పగించింది పాకిస్తాన్. ఐతే అంతకంటే ముందు పైలెట్ అభినందన్ నుంచి ఓ వీడియో మెసేజ్ తీసుకుంది పాక్ ఆర్మీ. దాన్ని సామాజిక నెట్వర్కింగ్ సైట్లలో షేర్ చేసింది. ఆ వీడియోలో అభినందన్ ఇలా చెప్పారు.
''నేను కిందపడ్డ సమయంలో అక్కడ చాలా మంది జనం గుమికూడి ఉన్నారు. నా పిస్టోల్ కింద పడిపోయింది. నన్ను నేను రక్షించుకోడానికి పరుగులు తీశాను. మూక నా వెంట పడ్డారు. వాళ్లు చాలా ఆవేశంలో ఉన్నారు.
అదే సమయంలో ఇద్దరు పాకిస్తాన్ జవాన్లు వచ్చారు. వాళ్లే నన్ను మూక నుంచి రక్షించారు.
తర్వాత నన్ను వాళ్ల యూనిట్‌కు తీసుకెళ్లారు. అక్కడే ఫస్ట్ ఎయిడ్ చేశారు. తర్వాత ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడే వైద్యపరీక్షలు నిర్వహించారు."