Webdunia - Bharat's app for daily news and videos

Install App

అక్కినేని అభిమానుల మ‌న‌సు దోచుకున్న ఎన్టీఆర్..!

Webdunia
సోమవారం, 21 జనవరి 2019 (16:50 IST)
నంద‌మూరి - అక్కినేని కుటుంబాల మ‌ధ్య ఉన్న అనుబంధం గురించి ప్ర‌త్యేకించి చెప్ప‌న‌వ‌స‌రం లేదు. నాడు ఎన్టీఆర్ - అక్కినేని, త‌ర్వాత నాగార్జున - హ‌రికృష్ణ మ‌ధ్య ఉన్న అనుబంధం తెలిసిందే. మూడ‌వ త‌రంలో కూడా ఆ అనుబంధం కొన‌సాగుతోంది. అఖిల్ - తార‌క్ మ‌ధ్య‌, చైత‌న్య - తార‌క్ మ‌ధ్య కూడా మంచి స్నేహం ఉంది. ఆ కార‌ణంగానే అఖిల్ మిస్ట‌ర్ మ‌జ్ను సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. 
 
ఈ వేడుక‌లో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ... రాసి పెట్టుకోండి. ఈ రోజు చెబుతున్నాను. అఖిల్ విల్ బి వ‌న్ ఆఫ్ ద ఫైనెస్ట్ యాక్ట‌ర్ వ‌న్ డే. మీ అంద‌రితో పాటు నేను కూడా ఆ రోజు కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. అది ఎంతో దూరంలో లేదు.. ద‌గ్గ‌ర‌లోనే ఉంది. అది మిస్ట‌ర్ మ‌జ్ను సినిమాతో అని మీకు కూడా తెలుస్తుంది. 
 
మిస్ట‌ర్ మ‌జ్ను చిత్రం అఖిల్ కెరీర్లో ఒక గొప్ప చిత్రంగా మిగ‌లాల‌ని ఆ దేవుడిని మ‌న‌సారా కోరుకుంటున్నాను అన్నారు. అఖిల్ గురించి ఈ విధంగా మాట్లాడి యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ అక్కినేని అభిమానుల మ‌న‌సు దోచుకున్నాడు. మ‌రి.. అంద‌రి అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్టుగా మిస్ట‌ర్ మ‌జ్ను ఘ‌న విజ‌యం సాధించి అఖిల్‌కి తొలి విజ‌యాన్ని అందిస్తుంద‌ని ఆశిద్దాం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

చిన్నారిపై హత్యాచారం చేసిన నిందితుడి ఎన్‌కౌంటర్: PSI అన్నపూర్ణకు అభినందనలు

పంచ్‌లు - కిక్‌లు లేకుండా నిస్సారంగా సాగిన రోబోల బాక్సింగ్ (Video)

కారు డోర్ లాక్ : ఊపిరాడక అక్కా చెల్లెళ్లు మృతి

గర్భిణీ భార్యను గొంతు నులిమి హత్య చేసిన కసాయి భర్త!!

తరగతి గదులను కూల్‌గా ఉంచేందుకు ఆ లేడీ టీచర్ ఏం చేసిందో తెలుసా? (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

తర్వాతి కథనం
Show comments