Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

విన‌య విధేయ రామ ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్..!

Advertiesment
విన‌య విధేయ రామ ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్..!
, సోమవారం, 24 డిశెంబరు 2018 (17:11 IST)
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న తాజా చిత్రం వినయ విధేయ రామ. ఊర మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఈ భారీ చిత్రం షూటింగ్ ఈనెల 26తో పూర్తి కానుంది. ఈ హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైన‌ర్‌లో చరణ్ సరసన కైరా అద్వానీ నటిస్తుంది. బోయ‌పాటి అంటేనే ఊర మాస్.. ఇక అత‌నికి మాస్ హీరో జ‌త క‌లిస్తే... ఆ సినిమా ఏరేంజ్‌లో ఉంటుందో ఊహించుకోవ‌చ్చు. అందుక‌నే మెగా అభిమానులు ఎప్పుడెప్పుడు ఈ సినిమాని చూస్తామా అని ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. 
 
ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే... ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ నెల 27న యూసఫ్‌గూడలోని పోలీస్ గ్రౌండ్స్‌లో భారీ స్ధాయిలో నిర్వ‌హించ‌డానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అదే ఈవెంట్లో ఈ చిత్రం యొక్క ట్రైలర్‌ను విడుదల చేయనున్నారని సమాచారం. అయితే ఈ వార్తలపై అధికారిక ప్రకటన వెలుబడాల్సి వుంది. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో ప్రశాంత్, ఆర్యన్ రాజేష్, స్నేహ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.
 
డి.వి.వి.దానయ్య డివివి నిర్మిస్తున్న ఈ చిత్రం సంక్రాంతి కానుక‌గా జనవరి 11న విడుదల కానుంది. ఇక చరణ్ నటించిన రంగస్థలం ఈ ఏడాది టాలీవుడ్‌లో విడుదలై అత్యధిక కలెక్షన్లు రాబట్టిన రెండవ చిత్రంగా రికార్డు సృష్టించింది. మ‌రి... విన‌య విధేయ రామ ఎలాంటి సంచ‌ల‌నం సృష్టించ‌నుందో చూడాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రభాస్ అంటే ఇష్టం.. ఆయనతో మళ్లీ చేయాలనివుంది : కంగనా రనౌత్