పెద్ద మనసుతో ఈ ధరిత్రిని - ఈ గుండెను మరొక్కసారి తాకిపో తాతా...

ఠాగూర్
బుధవారం, 28 మే 2025 (11:58 IST)
మహా నటుడు, విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు, టీడీపీ వ్యవస్థాపకుడు డాక్టర్ ఎన్.టి.రామారావు 102వ జయంతి వేడుకల బుధవారం ఘనంగా జరిగాయి. ఈ వేడుకలను పురస్కరించుకుని హైదరాబాద్ నగరంలోని ఎన్టీఆర్ ఘాటుకు ఆయన కుటుంబ సభ్యులతోపాటు అభిమానులు, సినీ రాజకీయ అభిమానులు పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు. 
 
ఎన్టీఆర్‌ ఘాట్‌కు నివాళులు అర్పించిన వారిలో హీరోలు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్‌లు ఉన్నారు. ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ ఓ ట్వీట్ చేశారు. "మీ పాదం మోపక తెలుగు ధరిత్రి చిన్నబోతోంది. మీ రూపు కానక తెలుగు గుండె తల్లడిల్లిపోతోది. పెద్ద మనసుతో ఈ ధరిత్రిని ఈ గుండెని మరొక్కసారి తాకిపో తాతా. సదా మీ ప్రేమకు బానిసను" అంటూ జూనియర్ ఎన్డీఆర్ ట్వీట్ చేశారు. 
 
ఈ పోస్ట్ పలువురి హృదయాలను తాకింది. దీంతో ఎన్టీఆర్ జోహార్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఎన్టీఆర్ జయంతి వేడుకలను పురస్కరించుకుని రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆయన అభిమానులు వివిధ రకాలైన సేవా కార్యక్రమాలను నిర్వహించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Aishwarya Rai: మానవాళికి సేవ చేయడంలోనే నిజమైన నాయకత్వం వుంది.. ఐశ్వర్యా రాయ్

మావోయిస్టు పార్టీకి దెబ్బమీద దెబ్బ - ఒక్కొక్కరుగా చనిపోతున్నారు...

అందుకే హెయిర్ కట్ చేసుకునేందుకు ఇష్టపడను.. పుట్టపర్తిలో సచిన్ కామెంట్స్

భారత్ పెద్ద మనసు వల్లే నా తల్లి ప్రాణాలతో ఉన్నారు : షేక్ హసీనా కుమారుడు

Sathya Sai Baba: సత్యసాయి బాబా సేవ, కరుణ మూర్తీభవించిన వ్యక్తి.. బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments