Webdunia - Bharat's app for daily news and videos

Install App

జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు శుభవార్త.. 22 నుంచి..?

Webdunia
శనివారం, 14 ఆగస్టు 2021 (15:36 IST)
జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు శుభవార్త. జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా జెమినీ టీవీ రూపొందించే ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ ప్రోగామ్ ఈ నెల 22వ తేదీ నుంచి ప్రారంభం కాబోతోంది. సోమవారం నుంచి గురువారం వరకూ రాత్రి 8.30 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. దీని కర్టెన్ రైజర్ వీడియోను ఈరోజు విడుదల చేశారు. ‘వస్తున్నా.. మీకోసం వస్తున్నా’ అంటూ జూనియర్ ఎన్టీఆర్ ఈ కర్టెన్ రైజర్ వీడియాతో ముందుకొచ్చారు.
 
ఆగస్టు 15 నుంచి ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందని మొదట్లో టాక్ వచ్చినా అది ఆగస్టు 22కు మారింది. ఇది అధికారిక ప్రకటన. సెప్టెంబరు 5 నుంచి బిగ్ బాస్ 5 షో కూడా ప్రారంభమవుతుంది. టీవీక్షకులకు ఇది పండగ అనుకోవచ్చు. విరామం లేకుండా టీవీలకు అతుక్కునే సమయం మరెంతో దూరంలేదు. అమ్మ సెంటిమెంట్‌తో తారక్ వదిలిన ప్రోమోకు విపరీతమైన స్పందన లభించింది. ‘ఇక్కడ మనీతో పాటు మనసులు కూడా గెలుచుకోవచ్చంటూ’ తారక్ మంత్రాన్ని పఠించారు ఎన్టీఆర్.
 
గతంలో కింగ్ నాగార్జున హోస్ట్‌లో మాటీవీలో ఈ షో కొనసాగింది. ఈసారి అది జెమినీ టీవీకి మారి టైటిల్ తో పాటు కొత్త రూపానికి చేరింది. స్టార్ మాతో జెమినీ ఢీ అంటే ఢీ అనబోతోందని ఈ కార్యక్రమంతో స్పష్టమవుతోంది. ఒకవిధంగా ఈ రెండు ప్రోగ్రామ్ లూ ఎన్టీఆర్ కూ, నాగార్జునకూ పరీక్షే. టీఆర్పీలో దేనికి ఎంత ప్రాధాన్యం లభిస్తుందన్న ఆసక్తి నెలకొంటుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పార్ట్‌టైమ్ నటిని.. ఫుల్‌టైమ్ పొలిటీషియన్‌ను : స్మృతి ఇరానీ

Chandra Naidu: ఢిల్లీలో మూడు రోజుల పాటు చంద్రబాబు పర్యటన

మద్యంమత్తులో కన్నబిడ్డను గర్భవతిని చేశాడు... బిడ్డపుడితే రైలు బాత్రూం‌లో పడేశారు...

Srisailam: శ్రీశైలం ప్రాజెక్టు గేట్ల ఎత్తివేత.. కృష్ణానదికి జలహారతి ఇచ్చిన చంద్రబాబు

మహిళలను కించపరచడమే వైకాపా నేతలు లక్ష్యంగా పెట్టుకున్నారు : పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments