Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జూ.ఎన్టీఆర్ ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ ప్రోమో రిలీజ్

Advertiesment
జూ.ఎన్టీఆర్ ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ ప్రోమో రిలీజ్
, ఆదివారం, 1 ఆగస్టు 2021 (16:31 IST)
'ఇక్క‌డ మ‌నీతో పాటు మ‌న‌సులు కూడా గెలుచుకోవ‌చ్చు
ఇక్కడ క‌థ మీది, క‌ల మీది.. ఆట నాది.. కోటి మీది..
రండి గెలుద్దాం.. ఎవ‌రు మీలో కోటీశ్వ‌రులు'  
 
అని టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ పిలుస్తున్నారు. ఈయన హోస్ట్ చేస్తున్న ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ కార్యక్రమం ఆగస్టు నుంచి ప్రసారం కానుంది. ఈ విషయాన్ని తెలియజేసే టీజర్‌ను ఆదివారం విడుదల చేశారు.
 
గతంలో ‘బిగ్‌బాస్’ షోతో అలరించిన ఆయన.. ఈ నెల నుంచి ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షో వేదికగా అభిమానులను పలకరించనున్నారు. ఈ షో జెమినీ టీవీలో ప్రసారంకానుంది. ఈ విషయాన్ని తెలియజేసే టీజర్‌ను ఆదివారం విడుదల చేశారు.
 
ఈ టీజ‌ర్ ఆస‌క్తిక‌రంగా ఉంది. క‌రోనా స‌మ‌యంలో పిల్లలు ఫీజులు కూడా క‌ట్ట‌లేని ప‌రిస్థితులు. ఓ ప్రైవేటు కాలేజీ లెక్చ‌ర‌ర్‌ని జాబ్ మానేయ‌మ‌ని చెబుతుంది. ఆ లెక్చ‌ర‌ర్ దోశ బండి పెట్టుకుంటాడు. అక్క‌డ కూడా త‌న స్టూడెంట్స్‌కు డ‌బ్బులు తీసుకోకుండా టిఫ‌న్స్ పెడుతుంటాడు. 
 
క‌ట్ చేస్తే.. అదే లెక్చ‌ర‌ర్ హాట్ సీట్‌లో తార‌క్ ఎదురుగా కూర్చుని పాతిక ల‌క్ష‌లు గెలుచుకుంటాడు. ఈ డ‌బ్బునేం చేస్తార‌ని స‌ద‌రు లెక్చ‌ర‌ర్‌ని తార‌క్ అడిగితే.. ఫీజులు క‌ట్ట‌లేని మా స్టూడెంట్స్‌కు ఇందులోని స‌గం డ‌బ్బుల‌తో ఫీజు క‌ట్టేస్తాన‌ని, మిగిలిన స‌గం డ‌బ్బులు వాడుకుంటాన‌ని చెప్ప‌డంతో తార‌క్ లెక్చర‌ర్‌ను అభినందిస్తాడు. 
 
ఇప్ప‌టికే బిగ్ బాస్ సీజన్ 1తో బుల్లితెర‌పై సెన్సేష‌న్ క్రియేట్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు మ‌రోసారి బుల్లితెర ప్రేక్ష‌కుల‌ను మెస్మ‌రైజ్ చేయ‌డానికి సిద్ధ‌మ‌వుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హ్యాపీ ఫ్రెండ్‌ షిప్ డే కాదు.. హ్యాపీ ఎనిమీస్ డే : ఆర్జీవీ ట్వీట్