Webdunia - Bharat's app for daily news and videos

Install App

భగవంతుడు కల్పించిన అరుదైన అవకాశం : జూ.ఎన్టీఆర్

"జై లవ కుశ" వంటి చిత్రంలో నటించడం తనకు భగవంతుడు కల్పించిన అరుదైన చిత్రం అని జూనియర్ ఎన్టీఆర్ వ్యాఖ్యానించారు. ఆయన నటించిన తాజా చిత్రం "జై లవ కుశ" ఆడియో రిలీజ్ వేడుకలు ఆదివారం రాత్రి జరిగింది.

Webdunia
సోమవారం, 4 సెప్టెంబరు 2017 (08:57 IST)
"జై లవ కుశ" వంటి చిత్రంలో నటించడం తనకు భగవంతుడు కల్పించిన అరుదైన చిత్రం అని జూనియర్ ఎన్టీఆర్ వ్యాఖ్యానించారు. ఆయన నటించిన తాజా చిత్రం "జై లవ కుశ" ఆడియో రిలీజ్ వేడుకలు ఆదివారం రాత్రి జరిగింది. ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ.... "జై లవ కుశ" ఒక చిత్రం కాదు. ఎందుకంటే, ఇలాంటి చిత్రంలో నటించే అవకాశం ఒక నటుడికి అరుదుగా భగవంతుడు ఇవ్వడం జరుగుతుంది. 'జనతా గ్యారేజ్' సినిమా తర్వాత నేను ఏం సినిమా చేయాలని బాగా కన్ఫ్యూజ్ అయిపోయాను. మనసుకు నచ్చిన చిత్రం చేయాలా? లేదా ట్రెండ్ ఫాలో అవుతూ వెళ్లాలా? అనే విషయం నాకు అర్థం కాలేదు.
 
ఎప్పుడైతే, దర్శకుడు బాబీ వచ్చి ‘జై లవ కుశ’ చిత్రం కథ చెప్పడం జరిగిందో ఆ రోజున గట్టిగా నిర్ణయించుకున్నాను. నా మనసుకు బాగా నచ్చిన కథ 'జై లవ కుశ'. ఈ కథ ఎందుకు బాగా నచ్చిందంటే.. బాగా ఎమోషనల్ అయిపోయే పాయింట్ ఏంటంటే.. ఈ చిత్రం కేవలం ఒక చిత్రం కాదు. నేను, మా అన్నయ్య కళ్యాణ్ రామ్‌తో పాటు మా పెద్దన్నయ్య కీర్తిశేషులు జానకిరామ్ కూడా ఈ రోజున ఈ స్టేజ్‌పై ఉంటే ‘జై లవ కుశ’ అనేది సార్థకమయి ఉండేదేమో!.. మేము అనుకున్నట్టు అన్నీ జరిగి ఉంటే, మా నాన్నగారి 60వ పుట్టినరోజు కానుకగా ఈ నెల 2న ఈ చిత్రాన్ని ఇద్దామని అన్నదమ్ములిద్దరమూ అనుకున్నాం. కానీ, కుదర్లేదు. 2 అయితే ఏముంది 21 అయితే ఏముందీ, నాన్నగారికి ఈ చిత్రం కానుకగా ఇవ్వాలి. నాన్నా.. అన్నదమ్ములుగా మేము చేసిన చిత్రమిది.. అని చెప్పాలనే కోరిక  ఉంది’ అని జూనియర్ ఎన్టీఆర్ భావోద్వేగంతో అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Kodali Nani: కొడాలి నాని ఆరోగ్య పరిస్థితిపై ఫోనులో ఆరా తీసిన జగన్.... ఆస్పత్రికి వెళ్లలేరా?

Polavaram: 2027 చివరి నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి: చంద్రబాబు ప్రకటన

Revanth Reddy: తెలంగాణ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి, కేటీఆర్‌ల జైలు కథలు..

Aarogyasri: ఏపీలో ఏప్రిల్ 7 నుంచి ఆరోగ్య శ్రీ సేవలు బంద్?

Putin: భారత్‌లో పర్యటించనున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments