Webdunia - Bharat's app for daily news and videos

Install App

అర్జున్ రెడ్డి తమిళ్ వెర్షన్ పేరు వర్మ అట

వివాదాలు చుట్టుముట్టినా తెలుగులో బంపర్ హిట్ కొట్టిన అర్జున్ రెడ్డి సినిమా తమిళంలో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను వివాదాలు చుట్టుముట్టినప్పుడు.. ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పూర్తి మద్

Webdunia
శనివారం, 11 నవంబరు 2017 (11:48 IST)
వివాదాలు చుట్టుముట్టినా తెలుగులో బంపర్ హిట్ కొట్టిన అర్జున్ రెడ్డి సినిమా తమిళంలో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను వివాదాలు చుట్టుముట్టినప్పుడు.. ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పూర్తి మద్దతు తెలిపి సంగతి తెలిసిందే. ఇందుకు మారుగానో ఏమో కానీ తమిళంలో రీమేక్ అవుతున్న అర్జున్ రెడ్డి సినిమాకు దర్శకుడు ''వర్మ'' అనే పేరు పెట్టేశారా అనిపిస్తోంది. 
 
విజయ్ దేవరకొండ హీరోగా తెలుగులో విడుదలైన ‘అర్జున్ రెడ్డి’ ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ చిత్రాన్ని తమిళ్‌లో కూడా తెరకెక్కించనున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన ఫేస్ బుక్ ఖాతాలో ఓ ఆసక్తికర పోస్ట్ చేశారు. అర్జున్ రెడ్డి తమిళ్ వెర్షన్ పేరు ''వర్మ" అట..  ఆ  పేరు ఎక్కడో విన్నట్లుంది అని వర్మ పోస్టులో పేర్కొన్నారు. ఇందుకు తోడుగా ఓ పోస్టర్‌ను కూడా జత చేశారు. 
 
నటుడు విక్రమ్ తనయుడు ధ్రువ్ ఈ సినిమాతో హీరోగా తెరకు పరిచయం అవుతున్నాడు. భారీ మొత్తం వెచ్చించి తెలుగు సినిమా రీమేక్ రైట్స్ కొన్న విక్రమ్ అండ్ కో ఈ సినిమాకు సంబంధించి టైటిల్ లోగోను విడుదల చేశారు. ఈ సినిమాకు వారు పెట్టుకున్న టైటిల్ ‘వర్మ’ అని. ఈ సినిమాకు సంబంధించి ధ్రువ్ గడ్డంతో ఉన్న స్కెచ్‌ను ఫస్ట్ లుక్‌లో భాగంగా విడుదల చేశారు కూడా. విక్రమ్ తన ఇన్‌స్టాగ్రమ్ అకౌంట్ ద్వారా అర్జున్ రెడ్డి రీమేక్ ఫస్ట్‌లుక్ ను విడుదల చేశాడు.

సంబంధిత వార్తలు

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments