ఈ సారైనా చియాన్ విక్రమ్ మసాలా "స్కెచ్" సక్సెస్ అయ్యేనా? (Teaser)
చియాన్ విక్రమ్ అంటే తమిళ ప్రేక్షకులతో పాటు ఇరుగు పొరుగు భాషల ప్రేక్షకులు అభిమానిస్తారు. నటుడిగా అతడికి కమల్ హాసన్ తర్వాత అంతటి స్థానాన్ని దక్కించుకున్నారు.
చియాన్ విక్రమ్ అంటే తమిళ ప్రేక్షకులతో పాటు ఇరుగు పొరుగు భాషల ప్రేక్షకులు అభిమానిస్తారు. నటుడిగా అతడికి కమల్ హాసన్ తర్వాత అంతటి స్థానాన్ని దక్కించుకున్నారు. ప్రయోగాత్మక చిత్రాలతో తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను సృష్టించుకున్నారు. పైగా, ఇతర హీరోలతో పోల్చితే చియాన్ విక్రమ్ అగ్రభాగాన ఉంటారు. అందుకే ఆయనకు ఇటు తెలుగు, అటు తమిళలలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది.
ఫలితంగానే ఓ రజనీకాంత్, ఓ కమల్ హాసన్, ఓ సూర్య సినిమాల్లానే తెలుగు, తమిళ ప్రేక్షకులు విక్రమ్ చిత్రాల కోసం అమితాసక్తితో ఎదురు చూస్తుంటారు. అయితే గత కొంతకాలంగా విక్రమ్ నటించిన చిత్రాలు వరుసగా ప్లాప్ అవుతున్నాయి. ఎస్.శంకర్ దర్శకత్వంలో వచ్చిన "ఐ" వంటి భారీ చిత్రం తర్వాత కూడా నటించినవన్నీ ఫ్లాపులే కావడంతో విక్రమ్‌కి ఇబ్బందులు తప్పలేదు.
అయితే ఇలాంటి టైమ్‌లో మరో మాస్ మసాలా "స్కెచ్"తో ప్రేక్షకాభిమానుల ముందుకు వస్తున్నాడు. టైటిల్‌కి తగ్గట్టే ఇది భారీ యాక్షన్ మూవీ అన్న సంగతి తాజాగా రిలీజైన టీజర్ చూస్తే అర్థమవుతోంది. విక్రమ్ మాస్ అవతారంలో అదరగొట్టేస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో మిల్కీబ్యూటీ తమన్నా కథానాయికగా నటించింది. ఈ చిత్రానికి విజయ్ చందర్ దర్శకత్వం వహిస్తున్నారు. వచ్చే సంక్రాంతి బరిలో రిలీజ్ కానున్న ఈ చిత్రం తెలుగులోనూ రిలీజ్ కానుంది.