Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Tuesday, 1 April 2025
webdunia

పైసా వసూల్ టీజర్: తమ్ముడూ.. నేను జంగిల్ బుక్ సినిమా చూడలేదు.. బాలయ్య డైలాగ్స్ అదుర్స్ (Video)

హైదారాబాదులో డ్రగ్స్ మాఫియాపై సిట్ విచారణ పర్వం చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ కేసులో డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ పాత్ర వున్నట్లు వార్తలొచ్చాయి. ఆయన్ని సిట్ కూడా విచారించింది. అయితే డ్రగ్స్ కేసులో వి

Advertiesment
Paisa Vasool Stumper 101
, శుక్రవారం, 28 జులై 2017 (11:40 IST)
హైదారాబాదులో డ్రగ్స్ మాఫియాపై సిట్ విచారణ పర్వం చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ కేసులో డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ పాత్ర వున్నట్లు వార్తలొచ్చాయి. ఆయన్ని సిట్ కూడా విచారించింది. అయితే డ్రగ్స్ కేసులో విచారణకు హాజరైన పూరీ జగన్నాథ్, బాలయ్యతో తన సినిమా పైసా వసూల్‌పై దృష్టి పెట్టారు. తాజాగా బాలకృష్ణ, శ్రేయ, ముస్కాన్, కైరాదత్ తదితరులు నటిస్తున్న పైసా వసూల్ సినిమా స్టంపర్ శుక్రవారం రిలీజైంది. 
 
ఈ టీజర్లో బాలయ్య కృష్ణ డైలాగులు అదిరాయి. ఆయన బాడీ లాంగ్వేజ్, యాక్షన్ చూసి.. ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. తమ్ముడూ.. నేను జంగిల్ బుక్ సినిమా చూడలేదు. కాని అందులో పులి నాలాగే వుంటుందని చాలామంది చెప్పారు. అది నిజమో కాదో మీరే చెప్పాలి. ''ఐయామ్ ది హీరో, యు ఆర్ ది కమెడియన్, అండ్ విలన్ టచ్డ్ మై హీరోయిన్.. దిస్ ఈజ్ ద యాక్షన్ ఫిల్మ్ అంటూ.. బాలయ్య డైలాగులు పేలాయి. అలాగే పైసా వసూల్ ఐటమ్ సాంగ్‌‌ అదిరింది. సీనియర్ ఎన్టీఆర్‌లా బాలయ్య స్టెప్పులు అదిరాయి. 
 
ఇకపోతే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. సెప్టెంబర్ 29న చిత్రాన్ని విడుదల చేసేందుకు పూరీ ప్లాన్ చేస్తున్నారు. కొత్తరకం స్టైల్‌తో టీజర్ ద్వారా సినిమా ప్రమోషన్ అదిరిపోయింది. ఈ చిత్రంలో బాలయ్య ద్విపాత్రాభినయం చేస్తున్నట్టు తెలుస్తుండగా ఒక పాత్రలో టాక్సీ డ్రైవర్‌గా మరో పాత్రలో మాఫియా డాన్‌గా కనిపించనున్నట్టు సమాచారం. భవ్య క్రియేషన్స్ బేనర్ పై రూపొందుతున్న పైసా వసూల్ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సిట్ విచారణకు హుషారుగా వచ్చిన రవితేజ.. జిషాన్‌తో ఆరేళ్ల సంబంధంపై ఏమంటారో?