జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన చిత్రం 'జై లవకుశ'. ఈ చిత్రం ఎన్టీఆర్ కెరీర్‌లో ఓ బ్లాక్‌బస్టర్ హిట్. ఈ చిత్రంలో త్రిపాత్రాభినయం పోషించారు. ఈ సినిమా వెండితెరపైనేకాకుండా బుల్లితెరపై వచ్చిన ప్రతిసారి భార
జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన చిత్రం 'జై లవకుశ'. ఈ చిత్రం ఎన్టీఆర్ కెరీర్‌లో ఓ బ్లాక్‌బస్టర్ హిట్. ఈ చిత్రంలో త్రిపాత్రాభినయం పోషించారు. ఈ సినిమా వెండితెరపైనేకాకుండా బుల్లితెరపై వచ్చిన ప్రతిసారి భారీ రేటింగ్‌ను సొంతం చేసుకుంది.
కాగా, ఇప్పుడు ఈ సినిమా కొరియాలో జరిగే బుచీయోన్ అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్‌కు ఎంపికైంది. ఈ ఫిలిం ఫెస్టివల్‌కు ఎంపికైన ఒకే ఒక తెలుగు సినిమా 'జై లవకుశ' కావడం విశేషం. ఈ సినిమాతో పాటు భారతదేశానికి చెందిన మరో ఐదు సినిమాలకు అవకాశం దక్కింది. సల్మాన్ ఖాన్ 'టైగర్ జిందా హై', అమీర్ ఖాన్ 'సీక్రెట్ సూపర్ స్టార్', శ్రీదేవి 'మామ్', విజయ్ 'మెర్సల్' వంటి చిత్రాలు ఉన్నాయి.
ఈ ఫెస్టివల్‌కు ఎంపికైన ఈ సినిమాలను ప్రత్యేకంగా ప్రదర్శిస్తారు. 'జై లవకుశ' సినిమా బుచీయోన్ ఫిలిం ఫెస్టివల్‌కు ఎంపిక కావడం వెనుక ఓ కారణం ఉంది. ఒకే హీరో మూడు పాత్రలను చేయడంతో పాటు, క్లిష్టమైన మూడు వేరియేషన్స్‌ను చూపిస్తూ మెప్పించడం చాలా కష్టంతోకూడుకున్నది. మూడు పాత్రలలో ఎన్టీఆర్ అద్భుతంగా నటించాడు. అందుకే ఈ సినిమా ఫిలిం ఫెస్టివల్‌కు ఎంపికైందని ఫిల్మ్ నగర్ వర్గాలు పేర్కొంటున్నాయి.