Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఎన్టీఆర్ అర‌వింద స‌మేత టీజ‌ర్ రిలీజ్ డేట్ ఇదే..!

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ న‌టిస్తోన్న తాజా చిత్రం అర‌వింద స‌మేత‌. వీర రాఘ‌వ అనేది ట్యాగ్ లైన్. మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ద‌ర్శ‌కత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది. హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పైన రాధ

Advertiesment
ఎన్టీఆర్ అర‌వింద స‌మేత టీజ‌ర్ రిలీజ్ డేట్ ఇదే..!
, సోమవారం, 9 జులై 2018 (18:00 IST)
యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ న‌టిస్తోన్న తాజా చిత్రం అర‌వింద స‌మేత‌. వీర రాఘ‌వ అనేది ట్యాగ్ లైన్. మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ద‌ర్శ‌కత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది. హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పైన రాధాకృష్ణ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. టైటిల్ అండ్ ఫ‌స్ట్ లుక్ రిలీజ్ చేసిన‌ప్ప‌టి నుంచి టీజ‌ర్ ఎప్పుడు రిలీజ్ చేస్తారా అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. అయితే... టీజ‌ర్ రిలీజ్‌కి ముహుర్తం ఫిక్స్ చేసార‌ట‌.
 
అవును... టీజ‌ర్ రిలీజ్ చేయ‌డానికి చిత్ర‌ యూనిట్ డేట్ క‌న్ఫ‌ర్మ్ చేసారంటూ ఓ వార్త ప్ర‌చారంలోకి వ‌చ్చింది. ఇంత‌కీ ఎప్పుడంటారా..? ఆగ‌ష్టు 15. అయితే... ఈ డేట్‌ను చిత్ర‌ యూనిట్ అఫిషియ‌ల్‌గా ఎనౌన్స్ చేయాల్సి వుంది. ఇప్పటివ‌ర‌కు 50 శాతం ఈ సినిమా షూటింగ్‌ పూర్తైనట్లు సమాచారం. ఈ భారీ చిత్రాన్ని ద‌స‌రా కానుక‌గా అక్టోబ‌ర్ నెలలో రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. మ‌రి.. వ‌రుస విజ‌యాలు సాధిస్తోన్న ఎన్టీఆర్ ఈ సినిమాతో కూడా సెన్సేష‌న్ క్రియేట్ చేస్తాడేమో చూడాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సమంత, తమన్నా, రకుల్ ప్రీత్ తర్వాత కాజల్ అగర్వాల్.. బెల్లంకొండ శ్రీనివాస్‌తో..?