Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఎన్టీఆర్ అర‌వింద స‌మేత ఎంతవ‌ర‌కు వ‌చ్చింది..?

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ - మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ కాంబినేష‌న్లో రూపొందుతోన్న చిత్రం అర‌వింద స‌మేత. దీనికి వీర‌రాఘ‌వ అనేది ట్యాగ్ లైన్. ఇందులో ఎన్టీఆర్ కాలేజ్‌ స్టూడెంట్‌గా న‌టిస్తున్నాడు. ఇప్పుడు యాక్ష‌న్ ట్రాక్ నుంచి ఎంట‌ర్‌టైన్మెంట్

ఎన్టీఆర్ అర‌వింద స‌మేత ఎంతవ‌ర‌కు వ‌చ్చింది..?
, మంగళవారం, 17 జులై 2018 (12:33 IST)
యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ - మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ కాంబినేష‌న్లో రూపొందుతోన్న చిత్రం అర‌వింద స‌మేత. దీనికి వీర‌రాఘ‌వ అనేది ట్యాగ్ లైన్. ఇందులో ఎన్టీఆర్ కాలేజ్‌ స్టూడెంట్‌గా న‌టిస్తున్నాడు. ఇప్పుడు యాక్ష‌న్ ట్రాక్ నుంచి ఎంట‌ర్‌టైన్మెంట్ ట్రాక్ ఎక్కారు. ఈ చిత్రం కొత్త షెడ్యూల్‌ను ఇటీవ‌ల‌ స్టార్ట్‌ చేశారు. ఈ షెడ్యూల్‌లో కాలేజ్‌ బ్యాక్‌డ్రాప్‌ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇందులో ఎన్టీఆర్, పూజా హెగ్డే పాల్గొంటారు.
 
ఆగస్ట్‌ మూడు వరకు జరిగే ఈ షెడ్యూల్‌లో యాక్షన్‌ సీన్స్‌ కాకుండా ఓన్లీ ఎంటర్‌టైన్‌మెంట్‌ మీద దృష్టి పెట్టనున్నారట దర్శకుడు త్రివిక్రమ్‌. ఈ సినిమా మ్యూజిక్‌ సిట్టింగ్స్ పూర్తి అయ్యాయి. ఈ షెడ్యూల్‌ తర్వాత కొన్ని సాంగ్స్‌ కోసం చిత్ర బృందం పొల్లాచ్చి వెళ్లనుంది. ఈ చిత్రంలో జగపతిబాబు, నాగబాబు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఆగస్ట్‌ 15న అరవింద సమేత.. టీజర్‌ను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ భారీ చిత్రాన్ని అక్టోబర్‌ 10న రిలీజ్ చేయ‌నున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చిన రాజ్ త‌రుణ్‌..!