Webdunia - Bharat's app for daily news and videos

Install App

Nitin: నితిన్ తమ్ముడు నుంచి లయ పై జై బగళాముఖీ.. సాంగ్

దేవీ
మంగళవారం, 24 జూన్ 2025 (18:22 IST)
Laya - Jai Bagalamukhi song
"సంక్రాంతికి వస్తున్నాం" బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాణంలో వస్తున్న మరో సూపర్ హిట్ మూవీ "తమ్ముడు".  దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్నారు. లయ, వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ కీలక పాత్రలు పోషిస్తున్నారు. జూలై 4న "తమ్ముడు" సినిమా వరల్డ్ వైడ్ గా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు "తమ్ముడు" సినిమా నుంచి 'జై బగళాముఖీ..' లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు.
 
'జై బగళాముఖీ..' పాటకు జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు సాహిత్యాన్ని అందించగా, అజనీష్ లోకనాథ్ డివైన్ ట్యూన్ తో కంపోజ్ చేశారు. సింగర్ అబీ వీ ఆకట్టుకునేలా పాడారు. 'జై బగళాముఖీ..' పాట ఎలా ఉందో చూస్తే - ' జై బగళాముఖీ, జై శివనాయకీ, జై వనరూపిణీ, జై జయకారిణీ, విద్రుమ రూపిణి, విభ్రమ కారిణి, గగనఛత్ర వింధ్యాచలవాసిని, వీర విహారిణి, క్షుద్ర విదారిణి, సర్వజీవ సంరక్షిణి జననీ...' అంటూ సాగుతుందీ పాట. శక్తి స్వరూపిణి అయిన అమ్మవారి మహిమను కీర్తిస్తూ గ్రామ జాతర వేడుక సందర్భంగా 'జై బగళాముఖీ..' పాటను చిత్రీకరించారు. 
 
నటీనటులు - నితిన్, లయ, వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ, స్వసిక విజయన్, బేబీ శ్రీరామ్ దిత్య, తదితరులు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ట్రాఫిక్‌తో విసుగు చెంది బైకును మోసుకుంటూ వెళ్ళిన యువకుడు..

Kavitha and Sharmila: ఏపీలో షర్మిల.. తెలంగాణలో కవిత..? ఏం జరుగబోతోంది?

పీకలదాకా మద్యం సేవించి వచ్చి తరగతి గదిలో నిద్రపోయిన తాగుబోతు టీచర్!

Kavitha: తెలుగు రాజకీయాల్లో విడిపోయిన మరో కుటుంబం.. టీడీపీలోకి కవిత ఎంట్రీ ఇస్తారా?

నోబెల్ పురస్కారానికి సిఫార్సు చేయలేదనే భారత్‌పై ట్రంప్ అక్కసు.. అందుకే సుంకాల పోటు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆధునిక వాస్కులర్ సర్జరీ అవయవాలు, ప్రాణాలను ఎలా కాపాడుతుంది?

ఫ్లూ నుంచి రక్షణ కోసం ట్రైవాలెంట్ ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్‌ను విడుదల చేసిన జైడస్ వాక్సిఫ్లూ

మొక్కజొన్నలో వున్న పోషకాలు ఏమిటో తెలుసా?

జాతీయ పోషకాహార మాసం: మీ రోజువారీ పోషణను బాదం ఎలా మెరుగుపరుస్తుంది?

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

తర్వాతి కథనం
Show comments