Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మై హోమ్ అవతార రెసిడెంట్స్ లో సందడిగా తమ్ముడు ఫస్ట్ లిరికల్ సాంగ్

Advertiesment
laya, nitin tammudu song dance

దేవీ

, బుధవారం, 18 జూన్ 2025 (16:52 IST)
laya, nitin tammudu song dance
"సంక్రాంతికి వస్తున్నాం" బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాణంలో వస్తున్న మరో సూపర్ హిట్ మూవీ "తమ్ముడు".  దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్నారు. లయ, వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ కీలక పాత్రలు పోషిస్తున్నారు. జూలై 4న "తమ్ముడు" సినిమా వరల్డ్ వైడ్ గా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు మై హోమ్ అవతార్ రెసిడెంట్స్ సమక్షంలో "తమ్ముడు" సినిమా ఫస్ట్ సింగిల్ 'భూ అంటూ భూతం..' రిలీజ్ చేశారు.
 
లయ మాట్లాడుతూ - 'భూ అంటూ భూతం..' సాంగ్ రిలీజ్ మీ అందరి సమక్షంలో జరుపుకోవడం సంతోషంగా ఉంది. చాలా గ్యాప్ తర్వాత నేను మళ్లీ తమ్ముడు చిత్రంతో టాలీవుడ్ కు వస్తున్నాను. ఈ పాటకు కొరియోగ్రాఫ్ చేసిన విజయ్ బిన్ని, కంపోజ్ చేసిన అజనీష్, సాంగ్ రాసిన సింహాచలం మన్నేలా బ్యూటిఫుల్ ఔట్ పుట్ ఇచ్చారు. ఈ పాటలోని హుక్ స్టెప్ కూడా మీ అందరికీ నచ్చుతుంది. ఇలాంటి మంచి పాటలో నటించడం హ్యాపీ ఫీల్ కలిగించింది. 'భూ అంటూ భూతం..' సాంగ్ వీడియోస్ చేసి సోషల్ మీడియాలో నాకు ట్యాగ్ చేయండి. మీకు తప్పకుండా రిప్లై ఇస్తా. జూలై 4న తమ్ముడు చిత్రాన్ని థియేటర్స్ లో చూసి ఎంజాయ్ చేయండి. అన్నారు.
 
హీరో నితిన్ మాట్లాడుతూ - మై హోమ్ అవతార్ రెసిడెంట్స్ అందరి సందడి మధ్య ఈ రోజు మా 'భూ అంటూ భూతం..' సాంగ్ రిలీజ్ చేసుకోవడం హ్యాపీగా ఉంది. ఈ పాటకు పిల్లలు వేసిన స్టెప్స్ చాలా బాగున్నాయి. వాళ్ల మదర్స్ కూడా బాగా డ్యాన్స్ చేశారు. ఈ కథ చెప్పినప్పుడే డైరెక్టర్ శ్రీరామ్, ప్రొడ్యూసర్ రాజు గారు తమ్ముడు అనే టైటిల్ బాగుంటుందని చెప్పారు. అలా ఈ టైటిల్ ఫిక్స్ చేశాం. ఈ సినిమా కోసం 70 నుంచి 80 రోజులు అడవిలో షూటింగ్ చేశాం. ఈ  టైమ్ లో మా టీమ్ అంతా ఒక ఫ్యామిలీలా కలిసిపోయాం. ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు యాక్షన్, ఎంటర్ టైన్ మెంట్ వంటి అన్ని అంశాలతో తమ్ముడు సినిమా జూలై 4న మీ ముందుకు రాబోతోంది. మా మూవీని హిట్ చేశాక మళ్లీ మీ దగ్గరికే వచ్చి సక్సెస్ సెలబ్రేషన్స్ చేసుకుంటాం. అన్నారు.
 
నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ - మా సంస్థలో సంక్రాంతికి వస్తున్నాం వంటి బ్లాక్ బస్టర్ తర్వాత తమ్ముడు చిత్రాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాం. ఇప్పటిదాకా మా బ్యానర్ లో తండ్రీ కొడుకుల సెంటిమెంట్ తో బొమ్మరిల్లు, అన్నదమ్ముల కథతో సీతమ్మ వాకిట్లో..వంటి చిత్రాలు రూపొందాయి. ఫస్ట్ టైమ్ బ్రదర్, సిస్టర్ సెంటిమెంట్ తో తమ్ముడు చిత్రాన్ని రూపొందిస్తున్నాం. ఈ సినిమా కోసం 80 రోజుల వరకు అడవిలో షూటింగ్ చేశారు. ఆ సీన్స్ అన్నీ స్క్రీన్ మీద కొత్త ఎక్సిపీరియన్స్ ఇస్తాయి. సినిమాలో ఏదో వావ్ ఎలిమెంట్ ఉంటే తప్ప మీరు థియేటర్స్ కు రారు అని తెలుసు. అందుకే ఈ సినిమాను ఎన్నో వావ్ మూవ్ మెంట్స్ తో రూపొందించాం. నేను మాట ఇస్తున్నా తమ్ముడు సినిమా మీ అందరికీ నచ్చుతుంది. మీకు బెస్ట్ ఔట్ పుట్ ఇచ్చేందుకు ఇప్పుడు కూడా దర్శకుడు శ్రీరామ్ వేణు వర్క్ చేస్తున్నాడు అందుకే ఈ ఈవెంట్ కు రాలేదు. సెకండాఫ్ లో 45 నుంచి 50 మినిట్స్ మరో కొత్త ప్రపంచంలోకి ప్రేక్షకులు వెళ్తారు. అలా మా డైరెక్టర్ డిజైన్ చేశాడు. సంక్రాంతికి వస్తున్నాం తర్వాత ఫ్యామిలీస్, యూత్, మాస్, కిడ్స్ అందరూ కలిసి ఎంజాయ్ చేసేలా తమ్ముడు మూవీ ఉంటుంది. థియేటర్స్ నుంచి బయటకు వచ్చేప్పుడు ఒక మంచి సినిమా చూశామనే ఫీల్ కలుగుతుంది. నితిన్ మా సంస్థలో దిల్, శ్రీనివాస కళ్యాణం తర్వాత చేస్తున్న మూడో చిత్రమిది. నితిన్ హార్డ్ వర్క్ ఈ మూవీలో మరోసారి చూస్తారు. తమ్ముడు ట్రైలర్ వ్యూస్ జెన్యూన్ గా ఉండాలని చెప్పాను. మా ట్రైలర్ కు 40 లక్షల జెన్యూన్ వ్యూస్ వచ్చాయి. ఈ మెలొడీ సాంగ్ సినిమాలో మంచి మూవ్ మెంట్ లో వస్తుంది. ఇది కాకుండా మరో మూడు పాటలు కూడా మీరంతా ఎంజాయ్ చేస్తారు. జూలై 4న ఆడియెన్స్ నుంచి మా మూవీకి వావ్ రియాక్షన్ వస్తుందని ఆశిస్తున్నాం. తమ్ముడు మా బ్యానర్ కు వ్యాల్యూ పెంచే మరో సినిమా అవుతుంది. అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రజలకు సేవ చేసేందుకే రాజకీయాలు ఉన్నాయని ఎన్టీఆర్ నిరూపించారు