Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాకు జబర్దస్త్ టీం లీడర్‌గా ఛాన్స్ వస్తే చమ్మక్ చంద్ర ఏడ్చేశాడు.. ఆనంద్

Webdunia
శనివారం, 3 అక్టోబరు 2020 (11:19 IST)
''జబర్దస్త్'' నటుడు చమ్మక్ చంద్ర గురించి అందరికీ తెలిసిందే. ఈటీవీలో ''జబర్దస్త్'' ఫాలో అయ్యేవారికి అతను చాలా సుపరిచితుడు. ఫ్యామిలీ కష్టాలపై, భార్యాభర్తల మధ్య ఉండే పోరుపై ఎంతో అందంగా స్కిట్లు రూపొందించి లేడీ ఫ్యాన్స్‌ను ఎక్కువగా సంపాదించుకున్న చంద్ర ప్రస్తుతం ''అదిరింది" షో లో చేస్తున్నాడు. జబర్దస్త్ వదిలి వెళ్ళాక తనదైన సహకారాన్ని అదిరింది షోకి అందిస్తున్న చంద్ర ఆస్తి వివరాలను కూడా ఈ మధ్యనే నాగబాబు వెల్లడించారు.
 
చమ్మక్ చంద్రకి డబ్బు అంటే చాలా గౌరవం అని ఈ మధ్యన ఇల్లు కూడా కొనుక్కున్నాడని వ్యాఖ్యానించాడు. అయితే చంద్ర గురించి ఎవరికీ పూర్తిగా తెలియదు. ఇలాంటి సమయంలో చంద్రతో పాటు అతని టీమ్‌లో జబర్దస్త్‌లో ఎన్నో స్కిట్లు చేసిన ఆనంద్ చంద్ర నిజస్వరూపాన్ని బయటపెట్టాడు.
 
దాదాపు ఐదేళ్ల పాటు చంద్రతో పాటు ఉంటున్న ఆనంద్ కొన్ని నెలల క్రితం నుండి చంద్ర జబర్దస్త్ నుండి తప్పుకున్న తర్వాత ఆనంద్‌కు టీమ్ లీడర్‌గా అవకాశం వచ్చింది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో అతను చంద్ర గురించి ఎవరికీ తెలియని మాటలు చెప్పాడు. జబర్దస్త్‌తో చంద్రన్నతో పాటు తాను కూడా ఉన్నానని చెప్పాడు. అప్పుడే తనకు షోలో టీం లీడర్ ఛాన్స్ వచ్చింది. ఇదే విషయం చెబితే ఆయన అన్న తనను బాగా ప్రోత్సహించారు. ''నువ్వు ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలి రా నేను దూరం అవుతున్నా.." అని సొంత అన్నలాగా ప్రోత్సహించాడు.
 
అలాగే తనకు జబర్దస్త్ టీం లీడర్‌గా అవకాశం వచ్చిందన్న విషయాన్ని చెప్పినప్పుడు కూడా బాగా సంతోషించాడు. మంచి స్కిట్లు రాసి బెస్ట్ లీడర్ అనిపించుకోమని ప్రోత్సహించాడు. అయితే ఈ మాటలు చెబుతున్న సమయంలో ఆయన కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి. అప్పుడు నాకు మొహం చూపించలేకపోయాడు అంటూ ఆనంద్ వివరించాడు. అప్పుడు అతను కూడా బాగా ఏడ్చినట్లు చెప్పుకొచ్చాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పెళ్లికి నో చెప్పిందని కాలేజీ స్టూడెంట్‌పై కత్తితో దాడి... ఎక్కడంటే?

తిరుపతి: స్విగ్గీలో ఆర్డర్ చేసిన బిర్యానీలో బొద్దింకలు.. షాకైన కస్టమర్

ఆగ్రా సమీపంలో కుప్పకూలిన మిగ్-29 యుద్ధ విమానం

క్రాకర్స్‌తో ఛాలెంజ్.. ఆటో గిఫ్ట్.. సరదా కోసం వెళ్లి ప్రాణాలు బలి (video)

మొన్న దీపావళి పండుగ.. నేడు పుట్టినరోజు.. దువ్వాడకు మాధురి సూపర్ గిఫ్ట్ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అవకాడో పండు ఎందుకు తినాలి?

శీతాకాలంలో తినవలసిన ఆహారం ఏమిటి?

వెల్లుల్లి చట్నీ ఎందుకు తినాలో తెలుసా?

15 నిమిషాల నడక వల్ల 7 ప్రయోజనాలు, ఏంటవి?

గుమ్మడి విత్తనాలు ఎందుకు తినాలో తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments