Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చమ్మక్ చంద్రతో చతురు కాదు, అతడి ఆస్తి చూస్తే అదిరిపోతారు: నాగబాబు

Advertiesment
చమ్మక్ చంద్రతో చతురు కాదు, అతడి ఆస్తి చూస్తే అదిరిపోతారు: నాగబాబు
, శనివారం, 19 సెప్టెంబరు 2020 (15:43 IST)
మెగా బ్రదర్ నాగబాబు చాలాకాలంగా తన యూ ట్యూబ్ ఛానల్ ద్వారా చాలా విషయాలు పంచుకుంటున్నారు. ముఖ్యంగా జీవితంలో ఎలా క్రమశిక్షణతో బతకాలి అనే విషయాలను చక్కగా వివరిస్తున్నారు. నాగబాబుకి ఫాలోయింగ్ కూడా చాలా ఎక్కువ. ఎందుకంటే, జీవిత సూత్రాలను చూసి ఆచరించాలని చాలామంది ఆయన ఛానల్ ను ఫాలో అవుతున్నామని చెపుతున్నారు.
 
ఇకపోతే నాగబాబు జబర్దస్త్ షో వదిలి అదిరింది షో ప్రారంభించారు. నాగబాబుతో పాటు చమ్మక్ చంద్ర కూడా వచ్చేశారు. ఆయన పంచ్ డైలాగులు షోకి హైలెట్‌గా నిలుస్తుంటాయి. అసలు విషయానికి వస్తే నాగబాబు జీవితంలో క్రమశిక్షణ, డబ్బు గురించి చెబుతూ చమ్మక్ చంద్ర సక్సెస్ స్టోరీని వెల్లడించారు.
 
మొదట్లో జబర్దస్త్ షో చేసేటపుడు చాలామంది డబ్బు పరంగా చాలా ఇబ్బందులతో వుండేవారనీ, ఐతే ఆ తర్వాత చక్కగా ప్రణాళికలు వేసుకుని ఒక్కో మెట్టు ఎక్కుతూ వచ్చారన్నారు. అలాంటి వారిలో చమ్మక్ చంద్ర ఒకరని చెప్పుకొచ్చారు. చమ్మక్ చంద్ర ఇల్లు వేల్యూ కోటి రూపాయలు వుంటుందనీ, అందులో సకల సౌకర్యాలున్నాయని అన్నారు. అంతేకాదు, బిఎండబ్ల్యు కారును చమ్మక్ చంద్ర కొనగలిగారంటే ఆయన ప్లానింగ్ ఎంత చక్కగా వుందో అర్థమవుతుందన్నారు.
 
ప్లానింగ్ లేకపోతే కోటీశ్వరులు కూడా నిరుపేదలుగా మారిపోతారనీ, అలాగే ప్లానింగ్ వేసుకుని పక్కాగా వెళ్లేవారు నిరుపేదలైనా కోటీశ్వరలవుతారని తెలియజెప్పడానికి చమ్మక్ చంద్ర మంచి ఉదాహరణ అని నాగబాబు చెప్పారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వెంకీ 75వ చిత్రం ఇదే, సురేష్ బాబు ప్లాన్ అదిరింది