Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆగస్టు 13న నిహారిక నిశ్చితార్థం: వెల్లడించిన వరుణ్

Advertiesment
ఆగస్టు 13న నిహారిక నిశ్చితార్థం: వెల్లడించిన వరుణ్
, బుధవారం, 29 జులై 2020 (14:53 IST)
మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారిక. సినీ హీరోయిన్. బుల్లితెర యాంకర్ కూడా. అయితే, ఈమె త్వరలోనే ఓ ఇంటికి కోడలు కాబోతుంది. గుంటూరుకు చెందిన యువ పారిశ్రామికవేత్త చైతన్య అనే యువకుడిని పెళ్ళాడనుంది. ఈ వివాహ వేడుకను త్వరలోనే నిర్వహిస్తామని తండ్రి నాగబాబు ఇటీవల వెల్లడించారు. 
 
అయితే, తాజాగా నిహారిక అన్నయ్య, సినీ హీరో వరుణ్ తేజ్ ఈ వివాహంపై స్పందిస్తూ, నిశ్చితార్థ తేదీని వెల్లడించాడు. ఆగ‌స్టు 13వ తేదీన ఇరు కుటుంబాల పెద్ద‌ల స‌మ‌క్షంలో వారి ఎంగేజ్‌మెంట్ జ‌ర‌గ‌నుందని స్పష్టతనిచ్చాడు. కాగా, ఈ వేడుకను గుంటూరులో కొద్దిమంది బంధువుల మధ్య నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. 
 
కాగా, ఇటీవల తనకు కాబోయే భర్తతో కలిసి నిహారిక దిగిన ఫోటోలను ఇటీవల సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా, అవి వైరల్ అయ్యాయి. దీంతో నిహారిక పెళ్లిపై ఓ క్లారిటీ వచ్చింది. అప్పటి వరకు ఆమెకు పలువురు టాలీవుడ్ హీరోలకు ముడిపెడుతూ అనేక కథనాలు వచ్చిన విషయం తెల్సిందే.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నా రేటు రూ.2 కోట్లు? ఎవరు ముందొస్తే వారికే ఫస్ట్ ఛాన్సంటున్న జిగేల్ రాణి