Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాగబాబు, రోజా.. అవును వాళ్లిద్దరూ గొడవపడ్డారు..?

Webdunia
మంగళవారం, 3 సెప్టెంబరు 2019 (14:32 IST)
మెగా బ్రదర్ నాగబాబు, సినినటీ రోజా.. సినిమాల్లో ఈ ఇద్దరూ ఎప్పుడూ కలిసి నటించింది లేదు కానీ.. బుల్లితెరపై మాత్రం కలిసే కనిపిస్తున్నారు. సినిమాల్లో ఉన్నపుడు చిరంజీవితో కలిసి నటించిన రోజా.. ఇప్పుడు బుల్లితెరపై ఆయన తమ్ముడు నాగబాబుతో కలిసి రేటింగ్స్ పరంగా దూసుకుపోతోంది. 
 
ఆరేళ్ల కింద జబర్దస్త్ నుంచి ఈ జోడీ మొదలైంది. ఆ తర్వాత వాళ్లేం కలిసి చేసినా కూడా స్మాల్ స్క్రీన్‌పై సూపర్ హిట్ అవుతూనే ఉంది. ముఖ్యంగా ఈటీవీ అయితే తాము ఏ పండక్కి ఏ కార్యక్రమం చేసినా కూడా నాగబాబు, రోజా లేకుండా చేయడం లేదు.
 
తాజాగా వినాయక చవితి కానుకగా చేసిన విడుదలైన కార్యక్రమం ప్రస్తుతం నెట్టింటిని షేక్ చేస్తోంది. యూట్యూబ్‌లో విడుదలైన కొన్ని గంటల్లోనే ఇది అమాంతంగా ట్రెండ్ అవుతోంది. ఔను వాళ్లిద్దరూ గొడవపడ్డారు అంటూ సాగుతున్న ఈ కార్యక్రమంలో రోజా, నాగబాబు అప్పియరెన్సే ఆసక్తి పెంచేస్తుంది.
 
ఇద్దరూ కనిపిస్తుంటే రేటింగ్స్ కూడా బ్రహ్మాండంగా వస్తున్నాయి. దాంతో నాగబాబు, రోజా డేట్స్ ఇప్పుడు హాట్ కేక్స్ అయిపోయాయి. మరోవైపు రోజా కూడా ఎంత బిజీగా ఉన్నా.. తనకు పేరు తెచ్చిన జబర్దస్త్ కార్యక్రమాన్ని వదిలిపెట్టడం లేదు. 
 
మరోవైపు రాజకీయంగా పరిస్థితులు ఎలా ఉన్నా కూడా నాగబాబుతో వ్యక్తిగతంగా ఉన్న స్నేహాన్ని కూడా వదలడం లేదు. దాంతో ఈ జోడీకి మంచి స్పందన వస్తోంది. భవిష్యత్తులో ఈ జంట మరిన్ని హిట్స్ కొట్టడం ఖాయమని సినీ పండితులు జోస్యం చెప్పేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కొడాలి నానికి ఏమైంది.. ఎయిర్ అంబులెన్స్‌లో ముంబై తరలింపు!

ఛీ...ఛీ... పెంపుడు కుక్కతో యువతి లైంగిక చర్య, 15 వేల మందికి పోస్ట్ చేసింది

సీఎం చంద్రబాబుపై ఆనంద్ మహీంద్రా ప్రశంసల వర్షం... ఆలోచనలు అద్భుతమంటూ ట్వీట్

అణు ఒప్పందంపై సంతకం చేయకుంటే టెహ్రాన్‌ను పేల్చేస్తాం - ట్రంప్ : కుదరదంటున్న ఇరాన్

సజీవ సమాధికి వ్యక్తి యత్నం : అడ్డుకున్న పోలీసులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments