Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముఖేశ్ అంబానీ ఇంట్లో తారల సందడి... ఎందుకో తెలుసా?

Webdunia
మంగళవారం, 3 సెప్టెంబరు 2019 (13:46 IST)
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత, దేశ పారిశ్రామిక దిగ్గజం ముఖేశ్ అంబానీ ఇంటికి బాలీవుడ్ సెలెబ్రిటీలు క్యూకట్టారు. దీంతో అంబానీ నివాసం తారల తళుకులతో సందడిగా మారింది. సోమవారం గణేష్ చతుర్థిని పురస్కరించుకుని అంబానీ ఇంట్లో పెద్ద ఎత్తున పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బాలీవుడ్ తారాగణమంతా హాజరైంది. 
 
ముఖ్యంగా, బాలీవుడ్ అగ్రతారలు అమితాబ్ తన కుటుంబ సభ్యులతో హాజరుకాగా, బాలీవుడ్ యువ జంట రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అలాగే, ఆమీర్‌ఖాన్, అనిల్ కపూర్, కత్రినాకైఫ్, మాధురీ దీక్షిత్, కరిష్మాకపూర్, కరణ్ జోహార్, కాజోల్, విద్యాబాలన్, కృతి సనన్, అదితీ రావు హైదరీ.. హాజరై ప్రతిఒక్కరూ సాంప్రదాయ దుస్తుల్లో ప్రత్యేకంగా కనిపించారు. 
 
వీరితో పాటు మాజీ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, హర్భజన్, జహీర్‌ఖాన్‌లు తమతమ కుటుంబ సభ్యులతో హాజరుకాగా, హార్ధిక్ పాండ్యా మాత్రం సింగిల్‌గా వచ్చారు. సాధారణంగా అంబానీ ఇంట్లో ఈ వినాయక చవితిని ఎంతో ప్రత్యేకంగా భావించి పూజలు చేస్తుంటారు. 
 
ఈ యేడాదే ఏడాదే ముఖేష్-నీతా అంబానీల గారాలపట్టీ ఈషా, కుమారుడు ఆకాష్ అంబానీ వివాహం కావడం, పైగా ఒకే ఏడాది ఇంట్లో రెండు పెళ్లిల్లు జరగడంతో అంబానీల ఆనందానికి అంతు లేదని చెప్పొచ్చు. ఈ కారణంగా ఈ పూజా కార్యక్రమానికి బాలీవుడ్ సహా ముంబైకి చెందిన ప్రముఖులను ఆహ్వానించినట్లు తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వేలం పాటల్లో నిమ్మకాయకు రూ.5 లక్షల ధర ... ప్రత్యేక ఏంటో తెలుసా?

నీ భార్యను నాకు ఇచ్చేయ్.. పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటా.. భర్తను కోరిన వ్యక్తి.. చివరికి?

Perfume Day 2025: పెర్ఫ్యూమ్‌ డే.. వ్యక్తిగత గుర్తింపు కోసం సిగ్నేచర్ సెంట్‌

ఆన్‌లైన్ బెట్టింగుతో నష్టపోయా, చనిపోతున్నా క్షమించు తమ్ముడూ సెల్ఫీ(video)

కేసీఆర్ పుట్టిన రోజు : ఫ్లెక్సీలను తొలగించండి.. (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments